ఆడంబరానికి దూరం….ఆర్తులతో మమేకం

0
506
విభిన్నంగా గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు
పలుచోట్ల అన్నదానాలు, దుస్తుల పంపిణీ, సేవా కార్యక్రమాలు
స్వయంగా రక్తదానం చేసిన తెదేపా నేత…..అభిమానులు అదే బాటలో
రాజమహేంద్రవరం, నవంబర్‌ 22 : పుట్టినరోజు పండుగంటే ఎవరికి మాత్రం వేడుక కాదు. ఈ వేడుకను ఆనందంగా, అట్టహాసంగా జరుపుకోవాలని చాలా మంది ఉవ్విళ్ళూరుతారు. రాజకీయ నాయకులకైతే ఈ ఉబలాటం మరింత ఎక్కువగా ఉంటుంది. వారి అనుయాయుల హడావిడి అయితే వేరే చెప్పనక్కరలేదు. ఊరంతా ఫ్లెక్సీలు, తమ నాయకుని కటౌట్లు ఏర్పాటు చేయడం, కేక్‌ కటింగ్‌లు, భారీ ఎత్తున పూల దండలు, బొకేలు వగైరా హడావిడి అంతా యింతా కాదు.  పూల దండలు, బొకేలు ఇలా వేశాక అలా పక్కన పెట్టేస్తారు.  ఆ కాసేపు తప్ప ఆ తర్వాత వాటి ఉపయోగం ఉండనే ఉండదు. ఫ్లెక్సీలు, కటౌట్లు అయితే రహదారులపై ట్రాఫిక్‌కు అవరోధంగా మారతాయి. అదే పుట్టినరోజును ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలతో నిరాడంబరంగా జరుపుకుంటే ఆ ఆనందమే వేరు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ పుట్టినరోజు ఈరోజు అదే విధంగా జరిగింది. గన్ని జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరపాలని ఆయన అనుయూయులు, అభిమానులు భావించినా ఆయన వారించి ఆడంబరాలకు ఖర్చు చేసే మొత్తాన్ని సమాజానికి, పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు కేటాయించాలని  సూచించి తన పుట్టినరోజును సార్ధకత చేసుకున్నారు. తమ నాయకుని అభిమతాన్ని మన్నించి వారంతా నగరమంతా సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు జరుపుకున్నారు. కేక్‌ కటింగ్‌లు, పూల బొకేలు, పూల దండలు, ఫ్లెక్సీలకు దూరంగా ఉండి అనాధలకు, వృద్ధులకు, బదిరులకు చేరువయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ పుట్టినరోజు వేడుకలు నగరంలో  పలుచోట్ల నిరాడంబరంగా జరిగాయి. తొలుత ఆయన నివాసంలో సోమాలమ్మ ఆలయానికి చెందిన అర్చకులు, క్షేత్రపాలక వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం 42వ డివిజన్‌లోని ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో గన్ని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆ ప్రాంగణంలోని గాంధీ, మదర్‌థెరిసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బదిరులతో కలిసి ఆయన అల్పాహారం స్వీకరించారు.  అనంతరం మున్సిపల్‌ కాలనీలోని కాళీ స్పెషల్‌ నగరపాలక సంస్థ పాఠశాలలో విద్యార్ధులకు స్టీలు కంచాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.  ఈ శిబిరంలో గన్ని స్వయంగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు దళితరత్న కాశి  నవీన్‌కుమార్‌, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, మరుకుర్తి చంద్రశేఖర యాదవ్‌, జాలా మదన్‌ తదితరులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరానికి  సంబంధించిన ఏర్పాట్లను జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి డా.రమేష్‌ కిషోర్‌ పర్యవేక్షించారు.  ఆ తర్వాత లాలాచెరువు రోడ్డులోని జీవకారుణ్య సంఘానికి చేరుకుని వృద్ధులకు పండ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. అనంతరం లలితనగర్‌లోని ఆంజనేయస్వామి గుడివద్దకు చేరుకుని అన్నదాన కార్యక్రమాన్ని గన్ని ప్రారంభించారు. అనంతరం లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. అక్కడ నుంచి గోదావరి గట్టున ఉన్న జీవకారుణ్య సంఘానికి చేరుకుని అనాథ బాలలకు వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారికి  మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్కండేయేశ్వర స్వామి ఆలయ అర్చకులు పెద్దింటి సుబ్బారాయుడు,  గుండువారి వీధి రామాలయం అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు  వేదాశీస్సులు అందజేశారు. కాగా గన్నికి ఫోన్‌ ద్వారా హిందూపురం ఎమ్మెల్యే,  ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళిమోహన్‌, ఆయన కోడలు రూప, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తదితరులు ఫోన్‌లో గన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన చైతన్య యాత్రలో పాల్గొన్న గన్నికి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
గన్నికి శుభాకాంక్షల వెల్లువ
 డిప్యూటీ మేయర్‌ వాసిరెడి ్డ రాంబాబు, గంగిన హనుమంతరావు, ఆదిరెడి ్డ వాసు, రెడ్డి మణి,  కార్పొరేటర్లు  మళ్ళ నాగలక్ష్మీ, మర్రి దుర్గాశ్రీనివాస్‌, కొమ్మ శ్రీనివాస్‌, ద్వారా పార్వతి సుందరి, బొ ంత శ్రీహరి, కోసూరి  చండీప్రియ, యిన్నమూరి  రాంబాబు, గొందేశి మాధవిలత, మాటూరి రంగారావు, కోరిమిల్లి విజయశేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు ఎం.బ్రహ్మయ్య, ఎస్‌.రాజారావు, ఉప్పులూరి జానకిరామయ్య, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, పరిమి వాసు, డా. అనసూరి పద్మలత, మళ్ళ వెంకట్రాజు, మజ్జి రాంబాబు, నిమ్మలపూడి గోవింద్‌, హుస్సేన్‌ ఆలీ జానీ, మత్స్యేటి ప్రసాద్‌, యర్రమోతు ధర్మరాజు, కంటిపూడి శ్రీనివాస్‌,ఆచంట బాలాజీ, ఎలిపే జాన్‌,  టేకుమూడి  నాగేశ్వరరావు,మరుకుర్తి దుర్గాయాదవ్‌, మండవిల్లి శివ, మాటూరి సిద్ధార్ధ, తవ్వా రాజా, మద్ది నారాయణరావు, అయ్యల గోపి,యెనుముల రంగబాబు, నందం కుమార్‌ రాజా, సుంకవల్లి శారద, మొల్లి చిన్నియాదవ్‌, విశ్వనాథ రాజు, కోట కామరాజు, మల్లాది ఉదయ్‌, రొంపిచర్ల ఆంథోని, జక్కంపూడి అర్జున్‌, ఆశపు సత్యనారాయణ, పితాని కుటుంబరావు, కాపు, కవులూరి వెంకట్రావ్‌, చించినాడ తాతాజీ, జింకల జయదేవ్‌, కర్రి రాంబాబు, కెవిఎస్‌విఆర్‌ఎన్‌ ఆచార్యులు, వంక శ్రీనివాసచౌదరి, సెనివాడ అరు ్జన్‌, సాంబ, జెస్సీ, కరుటూరి అభి, వానపల్లి సాయిబాబా, ఆళ్ళ ఆనందరావు, ముత్య సత్తిబాబు, ఎండి మున్నా, ధమరసింగ్‌ బ్రహ్మాజీ, సింహాద్రి సతీష్‌, ఎస్‌వివి సత్యనారాయణ, గొందేశి  హరనాథరెడ్డి,  మద్ది శ్రీనివాస్‌, ఇండీవర శ్యామ్‌,కాట్రు లక్ష్మణస్వామి, కాట్రు రమణకుమారి, కాకర్ల సరోజిని, మారే వెంకటేశ్వరరావు, పసుపులేటి బాబి, కెవిడి భాస్కర్‌, జింకల జయదేవ్‌, పొలుగుమాటి కుమార్‌, గన్నవరపు సంజయ్‌, శివరామకలర్‌ ల్యాబ్‌ అధినేతలు సత్యవరపు గోపాలకృష్ణ, సత్యవరపు గోకుల మురళి, వారాది హనుమంతరావు, వారాది నాగబాబు, గుబ్బల రాంబాబు, మున్సిపల్‌ కాంట్రాక్టర్లు, గవర్నమెంట్‌ ప్లీడర్‌ యార్లగడ్డ రమేష్‌,వివిధ శాఖల అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు