ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా? 

0
219
ఇసుక కొరత తీర్చేవరకు పోరాటం – కోటగుమ్మం వద్ద తెదేపా నిరసన దీక్ష
సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్‌, జనసేన పార్టీలు, క్రెడాయి ప్రతినిధులు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 30 : భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి తద్వారా నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్న ఇసుక కొరతను అధిగమించి వెంటనే  ఇసుకను అందుబాటులోకి తెచ్చేవరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజమహేంద్రవరం కోటగుమ్మం వద్ద రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన నాయకులు నేడు నిరసన దీక్ష చేపట్టారు. ”కార్మికుల ఆత్మహత్యలు నివారించాలి.. కార్మికుల ఆకలి మంటలు తీర్చాలి” అనే నినాదంతో జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు, రూరల్‌ నియోజకవర్గ నాయకులు మార్ని వాసుదేవరావు, మార్గాని సత్యనారాయణ, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, చాంబర్‌ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్లు కురగంటి సతీష్‌, ద్వారా పార్వతి సుందరి, యిన్నమూరి రాంబాబు, గొర్రెల సురేష్‌, పాలవలస వీరభద్రం, కోసూరి చండీప్రియ, కడలి రామకృష్ణ, గొర్రెల సత్యరమణి, పార్టీ నాయకులు మండవిల్లి శివ, సూరంపూడి శ్రీహరి, రఫిక్‌రాజా, నాయుడు సూర్య, కడితి జోగారావు, ఉప్పులూరి జానకిరామయ్య, నల్లం శ్రీను, మజ్జి శ్రీనివాస్‌, జక్కంపూడి అర్జున్‌, పితాని కుటుంబరావు, విశ్వనాధరాజు, తలారి భాస్కర్‌, మానే దొరబాబు, చాన్‌భాషా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక.. పస్తులుంటూ ఉరి వేసుకోవడమే శరణ్యమన్నట్టుగా ప్రదర్శన చేసారు. బుర్రకథ కళాకారులు వైసిపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెదేపా నాయకులు మాట్లాడుతూ ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుకను అందుబాటులోకి తెచ్చేవరకు భవన నిర్మాణ కార్మికులకు కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. అందరికీ అందుబాటులో ఉండేలా నూతన ఇసుక పాలసీ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్‌ చేసారు. యూనిట్‌ ఇసుక ధరను తగ్గించడటంతో పాటు పనుల్లేక ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న భవన నిర్మాణ రంగం కార్మికులకు ఐదు నెలల జీవన భృతిని నెలకు 10 వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేసారు. పనుల్లేక ఆత్మహత్యకు పాల్పడిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ, అనుబంధ కార్మికులు రోడ్డున పడినా ముఖ్యమంత్రి జగన్‌ తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇసుక దొరకక…పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ఇసుక వారోత్సవాలు అంటూ జగన్‌ కొత్త నాటకానికి తెరతీసారని ధ్వజమెత్తారు. ఇటువంటి అసమర్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు మరింతగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తెచ్చేవరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. టీడీపీ చేపట్టిన ఉద్యమానికి కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌, జనసేన రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కందుల లక్ష్మీదుర్గేష్‌ ప్రసాద్‌, పలు కార్మిక సంఘాల నాయకులు మద్ధతు పలికారు.
ఇసుక కొరతను నివారించి త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చి భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని, అందరికీ అందుబాటులో ఉండేలా నూతన ఇసుక పాలసీ విధానంలో మార్పులు చేయాలని, యూనిట్‌ ఇసుక ధరను తగ్గించాలని, పనుల్లేక ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న భవన నిర్మాణ రంగం కార్మికులకు ఐదు నెలల జీవన భ తిని నెలకు 10 వేలు చొప్పున చెల్లించాలని, పనుల్లేక మ తి చెందిన కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు.
తెదేపా దీక్షలకు పలువురు మద్ధతు
కాగా టీడీపీ చేపట్టిన ఉద్యమానికి జనసేన రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కందుల లక్ష్మీదుర్గేష్‌ ప్రసాద్‌, అనుశ్రీ సత్యనారాయణ, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌, బుడ్డిగ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్రెడాయ్‌ సభ్యులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, వివిధ కార్మిక సంఘాలు పలు కార్మిక సంఘాల నాయకులు మద్ధతు పలికారు. అనంతరం నిరసన దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం చేరుకుని సబ్‌ కలెక్టర్‌ను కలిసి డిమాండ్లుతో కూడిన వినతి పత్రం అందచేశారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల ఇన్‌ఛార్జులు, ప్రెసిడెంట్లు, వివిధ కార్మిక సంఘాల నేతలు, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల టీడీపీ నాయకులు, రాజమండ్రి భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం, ఎన్‌టిఆర్‌ పెయింట్‌ యూనియన్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌, తాపి పని వార్ల సంఘం, ఇసుక పని వార్ల సంఘం, వివిధ సంఘాల కార్మికులు, అధిక సంఖ్యలో టీడీపీ అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here