ఆత్మీయ,ఆనంద భరిత వాతావరణంలో బిఆర్‌కె షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

0
149
హాజరైన సినీ నటి నిధి అగర్వాల్‌, ప్రజాప్రతినిధులు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 18 : వస్త్ర, బంగారు నగల వ్యాపారంలో పేరెన్నికగన్న బొమ్మన రాజ్‌ కుమార్‌ ఇప్పుడు సరికొత్త రూపంలో, సువిశాలమైన ప్రాంగణంలో కోటగుమ్మం సెంటర్‌లోని పుష్కర్‌ఘాట్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన బి.ఆర్‌.కె. మాల్‌ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్‌ ఈ ఉదయం ప్రారంభించారు. నమ్మకం, నాణ్యతలో 60 సంవత్సరాలుగా వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న బొమ్మన ఇప్పుడు కోటగుమ్మం సెంటర్‌లో ఆరు అంతస్తుల భవనంలో మరింత ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దిన బి.ఆర్‌.కె.మాల్‌ ప్రముఖులు, రాజకీయ నాయకుల చేతుల మీదుగా ప్రారంభమైంది. బి.ఆర్‌.కె.మాల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల నుండి వినియోగదారులు భారీగా తరలివచ్చారు. ఆహ్వానితులు, వినియోగదారుల సమక్షంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటి నిధి అగర్వాల్‌, రాష్ట్ర మంత్రి తానేటి వనిత, పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, సిఎంఆర్‌ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, చందన సంస్థల అధినేత చందన నాగేశ్వర్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అతిధులను బొమ్మన రాజ్‌ కుమార్‌, ఆయన తనయులు బొమ్మన జయకుమార్‌, రామచంద్రరావులు సాదరంగా స్వాగతించారు. ముందుగా సినీ నటి నిధి అగర్వాల్‌ మాల్‌ ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రావడం చాలా సంతోషంగా ఉందని, వస్త్ర వ్యాపార రంగంలో పేరెన్నికగన్న బొమ్మన రాజ్‌ కుమార్‌ సంస్థ ఇప్పుడు బి.ఆర్‌.కె.మాల్‌ ద్వారా సరికొత్త వస్త్రాలను, బంగారు ఆభరణాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన బి.ఆర్‌.కె.మాల్‌ అందరి అభిమానాన్ని చూరగొనాలని ఆకాంక్షించారు. ఎంపి భరత్‌ రామ్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్తామని, బి.ఆర్‌.కె.మాల్‌ లాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. మాల్‌ అధినేతలు బొమ్మన రాజ్‌ కుమార్‌, బొమ్మన జయకుమార్‌, రామచంద్రరావులకు శుభాకాంక్షలు తెలిపారు. మాల్‌ ప్రారంభం అనంతరం నిధి అగర్వాల్‌ బయటకు వచ్చి వినియోగదారులు, అభిమానులతో ముచ్చటించారు. బి.ఆర్‌.కె.మాల్‌ ప్రారంభోత్సవానికి బొమ్మన కుటుంబ సభ్యులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నందెపు శ్రీనివాస్‌, మేడపాటి షర్మిలారెడ్డి, కోళ్ళ అచ్యుత రామారావు, ప్రసాదుల హరనాధ్‌, అడపా వెంకటరమణ(గెడ్డం రమణ), అంబటి తాతారావు, దంగేటి వీరబాబు, బెజవాడ రంగా, అబ్దుల్లా షరీఫ్‌, కూర్మదాసు ప్రభాకర్‌, భీమవరపు వెంకటేశ్వరరావు, రోజ్‌ మిల్క్‌ రామచంద్రరావు, ఉప్పాడ కోటరెడ్డి, పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here