ఆదరిస్తున్న చంద్రబాబుకే మా ఓటు

0
393
6వ డివిజన్‌లో ఉత్సాహంగా నగర దర్శిని
రాజమహేంద్రవరం, జులై 27 : ప్రతినెలా క్రమం తప్పకుండా పింఛను అందిస్తూ అన్ని విధాలా ఆదుకుంటున్న సీఎం చంద్రబాబునాయుడికే తాము ఓటు వేస్తామని వృద్ధులు, మహిళలు తమ గళాన్ని వినిపించారు. స్థానిక 6వ డివిజన్‌లో డివిజన్‌ కమిటీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కార్పొరేటర్‌ మజ్జి మౌనికా సుధారాణి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నగర దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు తమ ఆనందాన్ని పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని, తమను ఎంతో ఆదరిస్తూ క్రమం తప్పకుండా పింఛను అందిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ సీఎం చంద్రబాబునాయుడికే ఓటు వేసి సీఎం చేస్తామని, ఆయన ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కార్పొరేటర్‌ కోరుమల్లి విజయశేఖర్‌, పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు, బుడ్డిగ రాధ,  తంగేటి సాయి, మజ్జి సోమేశ్వరరావు, కర్రి రాంబాబు, మహబూబ్‌ జాని, మళ్ళ వెంకట్రాజు, మెహబూబ్‌ ఖాన్‌, పోలాకి పరమేష్‌, పిల్లి శ్యామ్‌కుమార్‌, మజ్జి శ్రీనివాస్‌, శనివాడ అర్జున్‌, సీతా త్రినాధ్‌, మేరపురెడ్డి రామకృష్ణ, నందిగాని మురళీకృష్ణ, విశ్వనాథరాజు, భైరవ, పీతా కృష్ణమూర్తి, పోసిపో శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here