ఆదర్శనీయుడు అంబేద్కర్‌

0
250

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 14 : స్ధానిక మల్లిఖార్జున నగర్‌లోని అన్నయ్యచారి రోడ్డులో ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ రైట్స్‌ ప్రోటెక్షన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ అని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల వైపు నడవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధులు సైతం అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్య వైపు ఆసక్తితో పయనిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాము వెంకటేశ్వరరావు, దియ్యాన ఠాగూర్‌, మెరుపు రామారావు, రాజారావు, బూర రమేష్‌, రాచపల్లి ప్రసాద్‌, చిరంజీవి, దియ్యాన మూర్తి, మెరుపు శ్రీను, మరుకుర్తి రవియాదవ్‌, జాలా మదన్‌, పసుపులేటి బాబి, కె.సత్యనారాయణ, మారె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here