ఆదివారం అదిరేటి స్టెప్పేసి..

0
194
ఉత్సాహంగా సాగిన హ్యాపిసండే
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 16: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఈ రోజు ఉత్సాహంగా జరిగింది. నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలకు చెందిన విద్యార్ధిని, విద్యార్ధులు చక్కని నృత్యాలు ప్రదర్శించారు. హుకుంపేట పేటకు చెందిన మహత్మా స్కూల్‌, రంధివారి వీధి ప్రాధమిక పాఠశాల, ఇన్నీస్‌పేట బాయ్స్‌, ప్రాధమిక పాఠశాల, సిమెంట్రీ పేట ప్రాధమిక పాఠశాల, లాలాచెరువు నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాల, మేదరపేట ప్రాధమిక పాఠశాల విద్యార్ధులతో పాటు డ్యాన్స్‌ మాస్టర్‌ విజయ్‌, చిన్నారి పల్లవి వివిధ సినీ గీతాలకు నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ గొర్రెల సురేష్‌, స్కూల్స్‌ సూపర్‌ వైజర్‌ దుర్గా ప్రసాద్‌ పాల్గొనగా విశ్రాంత ఉపాధ్యాయులు రాజేష్‌, ఉపాధ్యాయురాలు రమాదేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here