ఆద్యంతం అన్నార్తుల సేవలో 

0
240
నిరాడంబరంగా గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు
వృద్ధులతో అల్పాహారం – అనాధ బాలలతో మధ్యాహ్న భోజనం – ప్రభుత్వాసుపత్రిలో యువకుల రక్తదానం
అంధ, బదిర విద్యార్థుల మధ్య కొనసాగిన సేవా కార్యక్రమాలు
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 22: అత్యంత నిరాడంబరంగా, సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా  సమాజంలోని అన్నార్తులు, ఆపన్నుల మధ్య గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు స్పూర్తిదాయకంగా జరిగాయి. ముందుగానే గన్ని కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు ఫ్లెక్సీలు, దండలు, బొకేలకు దూరంగా కుటుంబ సభ్యులతో పాటు, సహచరులు, అభిమానులు, అనాధలు, వృద్ధులు, బధిరుల మధ్య ఆనందంగా  వేడుకలు జరిగాయి. పుట్టినరోజు అంటే విలాసాలు, పార్టీలు చేసుకునే వారికి స్పూర్తినిస్తూ తనదైన శైలిలో ట్రెండ్‌ సెట్‌ చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు ఏదో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టే గన్ని కృష్ణ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేస్తూ  రాజమహేంద్రవరంలోని 50 డివిజన్లలో కార్పొరేటర్లు, డివిజన్‌ పార్టీ ఇన్‌ చార్జులు  మొక్కలు నాటి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయించి అందరూ  తమ పుట్టినరోజులకు మొక్కలు నాటితే పర్యావరణాన్ని కాపాడుకోగలుతామని ఇచ్చిన సందేశానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉదయం 8:30 గంటలకు గన్ని కృష్ణ నివాసంలో సర్వమత ప్రార్ధనలు జరిగాయి. వేదపండితులు, ముస్లిం పెద్దలు, క్రైస్తవ బోధకులు విచ్చేసి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఉదయం 9:00 గంటలకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి గన్ని కృష్ణ అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో గన్ని కృష్ణ ను ఘనంగా సత్కరించారు.అనంతరం ఉదయం 9:30 గంటలకు స్థానిక 42వ డివిజన్‌లోని మునిసిపల్‌ కాలనీలో తన స్వంత నిధులతో నిర్మించిన వినాయక ఆలయాన్ని గన్ని కృష్ణ , రాజేశ్వరి దంపతులు ప్రారంభించి పూజలు చేశారు.ఆ తరువాత గుడా నిధులతో  మునిసిపల్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌పై అంతస్తు నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు. మళ్ళ వెంకట్రాజు ఆధ్వర్యంలో కాళీ స్పెషల్‌ నగరపాలక సంస్థ పాఠశాలలో విద్యార్ధులకు అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు.ఉదయం 10:30 గంటలకు నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గొర్రెల రమణ, కె.వి.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో లాలాచెరువు రోడ్డులో ఉన్న జియోన్‌ అంధుల పాఠశాలలో విద్యార్ధుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి వారికి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఉదయం 10:45 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో టి.ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.నాయకులు కరుటూరి అభిషేక్‌,తెలుగు యువత నాయకులు రెహ్మాన్‌ దాదా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువకులను గన్ని కృష్ణ అభినందించారు. అనంతరం రెహ్మాన్‌ దాదా ఆధ్వర్యంలో టిబి వార్డులో రోగులకు గన్ని కృష్ణ రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం ఉదయం 11:15 గంటలకు లాలాచెరువు రోడ్డులో ఉన్న శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంలో వృద్ధుల సౌకర్యార్ధం గుడా నిధులతో టాయిలెట్స్‌ నిర్మాణానికి గన్ని కృష్ణ శ్రీకారం చుట్టారు. అక్కడ ఉన్న వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు.మరుగుదొడ్లు నిర్మాణంతో పాటు వృద్ధులకు వేడి నీళ్ళ సౌకర్యం కోసం గుడా ద్వారా హీటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు గన్ని కృష్ణ పేర్కొన్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో తెదేపా నాయకులు మజ్జి రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. గన్ని తన చేతుల మీదుగా  భోజనాలు వడ్డించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు లలితానగర్‌లో వారాది నాగబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గన్నికృష్ణ  ప్రారంభించారు. మధ్యాహ్నం 1:00 గంటలకు గోదావరి గట్టున ఉన్న శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంలో అనాధ బాలలతో కలిసి గన్ని కృష్ణ కుటుంబ సభ్యులు, సహచరులు భోజనాలు స్వీకరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు మల్లయ్యపేటలోని మదర్సా పాఠశాలలో ఎస్‌.ఎ.గపూర్‌ ఆధ్వర్యంలో విద్యార్ధులకు భోజనాలు ఏర్పాటు చేసి గన్నికృష్ణ చేతుల మీదుగా రగ్గులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గంగిన హనుమంతరావు, పిల్లి సుబ్రమణ్యం,  రెడ్డి మణి, కురగంటి సతీష్‌, నిమ్మలపూడి గోవింద్‌, తేతలి రాము, యర్రమోతు ధర్మరాజు, రాచపల్లి ప్రసాద్‌, రాయుడు శ్రీనివాస్‌, షేక్‌ సుభాన్‌, ఉప్పులూరి జానకిరామయ్య, పిన్నింటి ఏకబాబు, బుడ్డిగ రాధా, రామినేని మస్తాన్‌చౌదరి, కంటిపూడి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు, మళ్ళ నాగలక్ష్మి, గొందేశి మాధవీలత, కంటిపూడి పద్మావతి, కొమ్మా శ్రీనివాస్‌, పితాని లక్ష్మీ కుమారి, తలారి ఉమాదేవి, గగ్గర సూర్యనారాయణ, బెజవాడ రాజ్‌కుమార్‌, కురగంటి ఈశ్వరి, బూర దుర్గాంజనేయులు, ద్వారా పార్వతి సుందరి, రెడ్డి పార్వతి సతీష్‌, కరగాని మాధవి, తంగెళ్ళ బాబి, పెనుగొండ విజయభారతి, సింహా నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, పాలవలస వీరభద్రం, గరగ పార్వతి, కో-ఆప్షన్‌ సభ్యులు  కప్పల వెలుగుకుమారి, నాయకులు ఎ.సైదుబాబు, పెండ్యాల రామకృష్ణ, బొప్పన నాగేశ్వరరావు, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి, తవ్వా రాజా, శెట్టి జగదీష్‌, అరిగెల బాబు నాగేంద్రప్రసాద్‌, పెనుగొండ రామక ష్ణ, రంధి శ్రీనివాస్‌, పల్లి సాయి, దంతులూరి వెంకటపతి రాజు, పితాని కుటుంబరావు, మరుకుర్తి రవియాదవ్‌, కాకర్ల సుజనా, జక్కంపూడి అర్జున్‌, కొత్తూరి బాలనాగేశ్వరరావు, యిన్నమూరి దీపు, ముళ్ళపూడి రాంబాబు, ఎం.బ్రహ్మయ్య, ఎస్‌.రాజారావు, బొచ్చా శ్రీను, మాటూరి సిద్దార్ధ, మద్ది నారాయణరావు, సత్యవరపు గోపాలకృష్ణ, సత్యవరపు గోకుల మురళి, కవులూరి వెంకట్రావు, శెట్టి జగదీష్‌, గొందేశి హరనాథ్‌రెడ్డి, జాలా మదన్‌, నల్లం ఆనంద్‌, రాయి అప్పన్న, సింహాద్రి కోటిలింగేశ్వర్రావు, సింహాద్రి సతీష్‌, పి.సత్యనారాయణ, ఎస్‌.ఎ.గపూర్‌, మొల్లి చిన్ని యాదవ్‌, ముత్య సత్తిబాబు, శనివాడ అర్జున్‌, కర్రి రాంబాబు, పోలాకి పరమేష్‌, నందిగాని మురళీక ష్ణ, మజ్జి అప్పారావు, ఆశపు సత్యనారాయణ, శనివాడ అర్జున్‌, వానపల్లి సాయిబాబా, తలారి భగవాన్‌, వానపల్లి శ్రీనివాసరావు, ఎంఎ రషీద్‌, కొండబాబు, దొడ్డా విజయ్‌, వజ్రనాధ్‌, దమర్‌ సింగ్‌ బ్రహ్మాజీ, కంచిపాటి గోవింద్‌, పిల్లి వీరవెంకటరమణ, తలారి భాస్కర్‌, కె.వి.డి.భాస్కర్‌, సంసాని ప్రసాద్‌, పైలా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గౌడ,శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, కల్లు గీత సహకార సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి మణి ఆధ్వర్యంలో సంఘ డైరెక్టర్లు రేలంగి వీర వెంకట సత్యనారాయణ, టేకుమూడి నరసయ్య, అంగర గన్ని రాజు, నీలం చిన్నారావు, గుత్తుల దుర్గారావు తదితరులు గన్ని క ష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. గుడా కార్యదర్శి సన్యాసిరావు, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రామ్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లు సత్యమూర్తి, శాంతిలత, వెంకటకృష్ణ, గుడా సిబ్బంది గన్ని కృష్ణకు మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రెడాయ్ ప్రతినిధులు కలుసుకొని గన్ని కృష్ణకు మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అన్న క్యాంటీన్ల నిర్వాహణకు లక్ష విరాళం
తన పుట్టినరోజు సందర్భంగా పేదల ఆకలి తీర్చేందుకు సిఎం చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల నిర్వాహణకు గన్ని కృష్ణ, రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. రెండు రోజుల ముందుగానే చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. శుభకార్యాలు, పుట్టినరోజులు పురస్కరించుకొని అన్న క్యాంటీన్ల నిర్వాహణకు విరాళాలు అందించాలన్న చంద్రబాబు సూచన మేరకు గన్ని ఈ విరాళం అందించడం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి.
ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపిన నేతలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజ్యసభ సభ్యులు గరికిపాటి మోహనరావు, పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, ఎమ్మెల్సీలు వి.వి.వి.చౌదరి, మంతెన సత్యనారాయణరాజు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, తదితరులు ఫోన్‌ ద్వారా గన్ని కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here