ఆనందనగర్‌లో అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు 

0
212
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చర్యలు
రాజమహేంద్రవరం,ఆగస్టు 11 : అర్హులైన వారందరికీ విడతలు వారీగా ఇళ్ళ పట్టాలను మంజూరు చేస్తామని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 46 డివిజన్‌లోని ఆనంద్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా కొంతమంది పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వాటికి పట్టాలు ఇవ్వవలసిందిగా ప్రజాప్రతినిధుల ద ష్టికి, అధికారుల ద ష్టికి తీసుకుని వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నగర దర్శిని కార్యక్రమంలో ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సబ్‌ కలెక్టర్‌ సిఎం సాయికాంత్‌ వర్మ చర్చించి ఈ ఉదయం సబ్‌ కలెక్టర్‌తోపాటు, అర్బన్‌ తహాశీల్దార్‌ రాజేశ్వరరావు, సర్వేయర్లతో పాటు కలిసి సంబంధిత ప్రాంతాన్ని సందర్శించారు. ప్రభుత్వ స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారికి అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అప్పారావు అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఒక లే అవుట్‌గా తీర్చిదిద్ది స్థానికులకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికే పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని, ఆ ఆదేశాలకు అనుగుణంగా పట్టాలు ఇస్తామని చెప్పారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు బొచ్చా శ్రీను, పిడిమి ప్రకాష్‌,రవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here