ఆపన్నులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

0
266

స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో గొందేశి శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు

రాజమహేంద్రవరం, జనవరి 4 : సమాజంలో ఏ ఆదరణకు నోచుకోని ఆపన్నులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ న్యాయవాది యంగ్‌ అడ్వకేట్స్‌ సేవింగ్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు గొందేశి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా 19వ డివిజన్‌ కార్పొరేటర్‌ గొందేశి మాధవీలత, పార్టీ నాయకులు గొందేశి హరనాథ్‌ ఆధ్వర్యంలో లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేసి కేక్‌ కట్‌ చేసి అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. నిరాశ్రయులైన వృద్ధులను ఆదుకుంటున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులను అభినందించారు. తన పుట్టినరోజు వేడుకలను వృద్ధుల సమక్షంలో నిర్వహించిన హరనాథ్‌ దంపతులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్నమాంబ ఆలయ చైర్మన్‌ శాంతారామ్‌, సభ్యులు పిలకా వెంకట రమణారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు గిన్ని సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కన్నారెడ్డి, జి.సత్యనారాయణరెడ్డి, ఎ.లక్ష్మణరావు, గనిరాజు, దుర్గారెడ్డి, బబ్బి, శేషు, చిట్టిమాని సత్తిబాబు, మల్లిపూడి వీరన్న, పూడి ప్రకాష్‌ పాల్గొన్నారు. గొందేశి శ్రీనివాసులరెడ్డికి స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here