ఆరంభ్‌ సేవలు అభినందనీయం

0
91
రాజమహేంద్రవరం, జనవరి 11 : అటిజమ్‌ అభివృద్ధి లోపంతో కూడుకుని జీవితాంతం కనిపించే విభిన్నమైన మానసిక స్థితి కల్గిన బిడ్డల యొక్క యోగక్షేమాలను కోరుతూ ప్రత్యేక శిక్షణకు తాపత్రయం పడుతూ ఎంతో ఓర్పు, సహనంతో సేవలందిస్తున్న ఆరంభ్‌ ఎ స్కూల్‌ ఫర్‌ అటిజమ్‌ నిర్వాహకులు అభినందనీయులని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు. రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో విభిన్నమైన మానసిక స్థితిలో ఉన్న పిల్లల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న ఆరంభ్‌ ఎ స్కూల్‌ ఫర్‌ అటిజమ్‌ కేంద్రంలో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరంభ్‌లో విభిన్నమైన మానసిక స్థితి కల్గిన పిల్లల కోసం తీసుకుంటున్న చర్యలపై సంస్థ నిర్వాహకులు శారద ఎమ్మెల్యే రాజాకు వివరించారు. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ అటిజమ్‌ అభివృద్ధిలోపంతో కూడుకుని జీవిస్తున్న పిల్లల పట్ల ఎంతో సహనం, ఓర్పుతో నిర్వాహకులు చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు. నిబద్ధతతో జీవితాన్ని త్యాగం చేయడం చూస్తుంటే మాటల్లో చెప్పలేని విధానం కన్పిస్తుందన్నారు. సమాజంలో అనేక సమస్యలను చూసి చలించిపోతూ బాధపడతామని, కానీ ఆ సమస్యను ఎదుర్కొంటున్న చిన్నారుల కోసం ఒక సంకల్పంతో ముందుకు రావడం శ్లాఘనీయమని అన్నారు. పిల్లల కోసం పడుతున్న తపనలో నా వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు సహకారం అందిస్తానని, ఆరంభ్‌ సంస్థ కార్యకలాపాల కోసం అవసరమైన భవన నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాకారాన్ని అందిస్తానని నిర్వాహకులకు జక్కంపూడి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు జానకీ రామ్‌, స్థాని గ్రామ పెద్దలు కందుల త్రినాథ్‌, పేపకాయల రాంబాబు, కర్రి వీరబాబు, పేపకాయల పోతురాజు, పేపకాయల విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామవరంకు చెందిన ప్రముఖులు బొల్లు గోవింద్‌ సంస్థ నిర్వాహణకు లక్ష రూపాయలను ఆర్థిక సహాయంగా ఈ సందర్భంగా అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here