ఆరెస్టులకు నిరసనగా తెదేపా శ్రేణుల నిరసన

0
97
ఎమ్మెల్యే భవాని హౌస్‌ అరెస్టు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 11 : తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు  కార్యక్రమాన్ని అడ్డుకోవడం వైసిపి పిరికిపంద చర్య అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విమర్శించారు. చలో ఆత్మకూరు కార్యక్రమం నేపథ్యంలో..ఈ ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకుని ఆయన్ను తన నివాసంలో పోలీసులు గ హ నిర్భంధం చేయడంతో ఆయన తన నివాసంలోనే నిరసన దీక్షకు పూనుకున్నారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని క ష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడులను విజయవాడలో గ హ నిర్భందం చేశారు. అక్కడ నుంచి వారు ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం తిలక్‌ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులుకార్యకర్తలను రాత్రుల సమయంలో పోలీసులతో అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం వైసిపి పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, వంద రోజుల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసిపి నాయకులను అరెస్టులు చేయకుండా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పరామర్శకు వెళుతున్న తమ  నాయకులు, కార్యకర్తలను ముందే అరెస్టులు చేయడం మంచి పద్దతి కాదన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి  (వాసు) మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇటువంటి చర్యలకు ఎన్నడూ పూనుకోలేదన్నారు. ఏ ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, కార్యకర్త, అభిమానిని కూడా అరెస్టు చేసిన దాఖలాలు లేవన్నారు.
తెదేపా నేతల అరెస్టు… పోలీసు స్టేషన్‌కు తరలింపు
తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులకు ఖండిస్తూ తిలక్‌ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం ఎదుట నిరసన తెలియచేస్తున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), నాయకులు రెడ్డి రాజు, మరుకుర్తి రవి యాదవ్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేసి ప్రకాశంనగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, ఛాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, రెడ్డి రాజు, మాజీ కార్పొరేటర్లు కడలి రామక ష్ణ, రెడ్డి పార్వతి, సింహా నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, తలారి ఉమాదేవి, మాటూరి రంగారావు, కోరుమిల్లి విజయశేఖర్‌, తంగెళ్ల బాబి, చాన్‌ భాషా, కరగాని వేణు, నాయకులు కంటిపూడి రాజేంద్రప్రసాద్‌, తంగేటి సాయి, మజ్జి రాంబాబు, నక్కా దేవి, ఇన్నమూరి దీపు, ముసిని బాబూరావు, పితాని కుటుంబరావు, బొచ్చా శ్రీను, షేక్‌ సుభాన్‌, యండి మహబూబ్‌ జానీ, యండి మహబూబ్‌ ఖాన్‌, మొకమాటి సత్యనారాయణ, పెనుగొండ రామక ష్ణ, ఉప్పులూరి కాశివిశ్వనాధ్‌, మస్తాన్‌ చౌదరి, కడితి జోగారావు, బుడ్డిగ రవి, కొమ్మా రమేష్‌, ఆశపు సత్యనారాయణ, బొమ్మనమైన శ్రీనివాస్‌, నేమాని శ్రీను, తలారి భాస్కర్‌, సూరంపూడి శ్రీహరి, జోగి నాయుడు, నాయుడు సూర్య, పాలిక శ్యామ్‌, మరుకుర్తి రవి యాదవ్‌, సత్తి వెంకట సాయి సందీప్‌, బేసరి చిన్ని, అట్టాడ రవి, గొర్రెల రమణి, మాలే విజయలక్ష్మి, కర్రి రమణమ్మ, జోగినాయుడు మాస్టారు, ఆయా డివిజన్ల టీడీపీ ప్రెసిడెంట్లు శ్రీను, ధర్మ, శివ, ఉమా, బిక్కిన రవి, మండల రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here