ఆరోగ్యమే ఆనందం.. మహాభాగ్యం : గన్ని కృష్ణ

0
249
ఐదు డివిజన్లలో జీకె స్పందన, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల వైద్య శిబిరం
సంచార వైద్యవాహనంలో అధునాతన వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
రాజమహేంద్రవరం, జనవరి 5 : ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే అంతా శూన్యమని, అందుకోసమే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి హాస్పిటల్‌ సంయుక్తంగా చేపట్టిన ఉచిత కంటి-పంటి-గుండె వ్యాధుల సంచార వైద్య శిబిరంతో పాటు పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ తన ఎంపి నిధులతో రూపొందించిన క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల వాహనం ద్వారా క్వారీ సెంటర్‌లో ఉన్న శివాలయం వద్ద 45,46,47,48,49 డివిజన్ల ప్రజల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గన్నికృష్ణ ప్రారంభించారు. కంటి,పంటి, చెవి,ముక్కు,గొంతు, గుండె, క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. అధునాతన వైద్య సౌకర్యాలతో కూడిన సంచార వైద్యశాలలో జిఎస్‌ఎల్‌ వైద్యులు రోగులను పరీక్షించారు. కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో కేటరాక్ట్‌ అవసరమైన వారికి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తారు. పరీక్షలు చేయించుకున్న వారికి జిఎస్‌ఎల్‌కు చెందిన ఫార్మసీ సంస్థ కంపాస్‌ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ  మాట్లాడుతూ జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ సంయుక్తంగా మూడవ క్యాంపును 45,46,47,48,49 డివిజన్ల ప్రజల కోసం ఏర్పాటు చేశామని, అయితే కంటి,పంటి,గుండె,చెవి,ముక్కు,గొంతు వ్యాధులతో పాటు పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ తన ఎంపి నిధులతో తయారు చేసిన కాన్సర్‌ నిర్ధారణ పరీక్షల వాహనాన్ని ఈ వైద్య శిబిరంలో ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు.ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి సవివరమైన పరీక్షలు గానీ, చికిత్సలు గానీ అవసరమైతే వారికి ప్రత్యేక కార్డులు ఇచ్చి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో ఉచితంగా గానీ, ఖర్చు మేరకే ఫీజుతో వైద్యం చేస్తారని తెలిపారు. బెడ్‌ చార్జీలు, డాక్టర్‌ ఫీజులు ఉండవని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ కాశి నవీన్‌ కుమార్‌,  నగర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, రాచపల్లి ప్రసాద్‌, కార్పొరేటర్‌ గరగ పార్వతి,  పార్టీ నాయకులు మరుకుర్తి రవియాదవ్‌, కవులూరి వెంకట్రావు, ఆశపు సత్యనారాయణ, రేవాడ సత్యనారాయణ, విజ్జిన సుధాకర్‌, పిడిమి ప్రకాష్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గరగ మురళీకృష్ణ , బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ , బిక్కిన రవికిషోర్‌, తూము సత్యనారాయణ, విశ్వనాధరాజు, సెనివాడ అర్జున్‌,వెంకటేశ్వరరావు, దంతులూరి వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here