ఆరోగ్యమే మహాభాగ్యం

0
238
శ్రీరామనగర్‌లో జికె స్పందన, జిఎస్‌ఎల్‌ ఉచిత వైద్య శిబిరం
సందర్శించిన ఎంపి మురళీమోహన్‌, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, జనవరి 23 : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ అన్నారు. జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఆలోచన మేరకు జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి హాస్పిటల్‌ సంయుక్తంగా చేపట్టిన ఉచిత కంటి-పంటి-గుండె,ఇ.ఎన్‌.టి. వ్యాధుల సంచార వైద్య శిబిరంతో పాటు పార్లమెంట్‌ సభ్యులు మురళీమోహన్‌ తన ఎంపి నిధులతో రూపొందించిన క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల వాహనం ద్వారా శ్రీరామనగర్‌ లోని బివిఎం స్కూల్‌  వద్ద 37,42,43,44, డివిజన్ల ప్రజల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మురళీమోహన్‌ ప్రారంభించారు. కంటి,పంటి, చెవి,ముక్కు,గొంతు, గుండె, కాన్సర్‌ నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. అధునాతన వైద్య సౌకర్యాలతో కూడిన సంచార వైద్యశాలలో జిఎస్‌ఎల్‌ వైద్యులు రోగులను పరీక్షించారు. కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో కాటరాక్ట్‌  ఆపరేషన్లు చేస్తారు. పరీక్షలు చేయించుకున్న వారికి జిఎస్‌ఎల్‌ కు చెందిన ఫార్మసీ సంస్థ కంపాస్‌ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ అధునాతన వైద్య సేవలతో ప్రజల ముందుకు వస్తున్నామని, ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా చేరువ చేస్తున్నామన్నారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ,ఆయన సోదరులు గన్ని భాస్కరరావు మంచి ఆలోచన చేసి రాజమహేంద్రవరం అంతా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారని,వారితో పాటు తాను రూపొందించిన సంచార వైద్యశాల ద్వారా క్యాన్సర్‌ పరీక్షలు చేస్తున్నామని,ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు.శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కురగంటి సతీష్‌,ఆదిరెడ్డి వాసు, కంటిపూడి పద్మావతి,రెడ్డి పార్వతి, సింహా నాగమణి, పాలవలస వీరభద్రం, తంగెళ్ళ బాబి,మర్రి దుర్గా శ్రీనివాస్‌, కంటిపూడి శ్రీనివాస్‌,అరిగెల బాబు నాగేంద్రప్రసాద్‌, కరుటూరి అభిషేక్‌, ఎ.సైదుబాబు,చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి,కవులూరి వెంకట్రావు, నిమ్మలపూడి గోవింద్‌,సంజీవరావు, ఎస్‌ఎ కరీం,మళ్ళ వెంకట్రాజు,సంసాని ప్రసాద్‌,ఎంఎ రషీద్‌, సయ్యద్‌ అప్సరీ,దంతులూరి వెంకటపతిరాజు,జాలా మదన్‌, బిక్కిన రవికిషోర్‌,భైరవ,కంచిపాటి గోవింద్‌,విశ్వనాధరాజు,దమర్‌ సింగ్‌ బ్రహ్మజీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here