ఆర్ధిక మాంద్యంతో కుదేలైన చిన్న వ్యాపార రంగం

0
107
బడా వ్యాపారవేత్తలకే మోడీ బాసట
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : భారత దేశంలో ఎప్పుడూ లేనంతగా ఆర్ధిక మాంద్యం తీవ్రంగా ఉందని, ఇప్పటికే లక్షలాది మంది  ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని, అదే సమయంలో మోడీ బడా వ్యాపారవేత్తలకు బాసటగా నిలవడంతో చిన్న వ్యాపార రంగం పూర్తిగా కుదేలయిపోయిందని, ఈక్రమంలో దీనికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్ధానిక ఆవ రోడ్డులో అపరాల సెక్షన్‌ కార్యాలయంలో సిపిఐ శాఖ సమావేశం సప్పా రమణ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ముఖ్యఅతిధిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ ఆటో మొబైల్‌ రంగంతో సహా పలు పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. బెస్ట్‌ప్రైస్‌, డీమార్ట్‌, రిలయన్స్‌, స్పెన్సర్స్‌తో సహా బడా మాల్స్‌ కారణంగా చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీటిపై ఆధారపడి ఉన్న చిన్న వర్తకులు, కార్మికులు రోడ్డున పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రజల మనుగడ ప్రశ్నార్ధకమవుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉన్నా, పనుల్లేక కార్మికులు పస్తులుంటున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కనీసం కార్మికుల కుటుంబాలను పరామర్శించని ముఖ్యమంత్రి జగన్‌ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తు ఉద్యమాలలో కార్మికులందరూ భాగస్వాములవ్వాలని కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, నగర సహాయ కార్యదర్శులు  వంగమూడి కొండలరావు, తోకల ప్రసాద్‌, జట్లు లేబర్‌ యూనియన్‌ కార్యదర్శి యడ్ల అప్పారావు, ఉపాధ్యక్షులు రాయి నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి వీసరపు రాంబాబు, సెక్షన్‌ కార్యదర్శి కంది ఆదినారాయణ, గొర్రెల హరనాధ్‌, చలుమూరి అబద్ధం, చోడవరపు రాము, చోడవరపు దేముడు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here