ఆలోచనకు అభివందనం

0
266
మొక్కలు నాటి గన్ని కృష్ణకు  శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 22 : పుట్టినరోజును పురస్కరించుకుని ఏ ఒక్కరూ ప్లెక్సీలు కట్టి దండలు, బొకేలను తమ వద్దకు తీసుకు రావద్దని, ఆయా డివిజన్లలో తాను పంపించిన మొక్కలు నాటి ఒక ఫొటో తనకు పంపడమే శుభాకాంక్షలుగా భావిస్తానని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభించింది. ఉదయమే కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జ్‌లు మొక్కలు నాటి సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలను పోస్ట్‌ చేసి గన్ని కృష్ణపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన గన్ని కృష్ణ నగరంలోని 50 డివిజన్లకు మొక్కలు పంపించారు. సోషల్‌ మీడియాలో వచ్చిన ఈ పోస్టింగ్‌లపై అన్ని వర్గాల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రతి పుట్టినరోజుకి గన్ని కృష్ణ ఏదో ఒక ట్రెండ్‌ను సెట్‌ చేస్తారని, ఈ ఏడాది మొక్కలు పెంపకంపై దృష్టిసారించడం అభినందనీయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here