ఆల్కట్‌తోటలో ఉచిత వైద్య శిబిరం

0
432

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 : స్థానిక ఆల్‌కట్‌ గార్డెన్స్‌ కన్నమాంబ గుడి వద్ద గుడ్లవారివీధిలో గొందేశి శ్రీనివాసరెడ్డి, అడపా వరప్రసాద్‌ల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు వెయ్యిమంది వైద్యసేవలు పొందారు. ఈ శిబిరంలో గుండె, కిడ్ని, కళ్ళు, దంతం, షుగర్‌, బీపీ, తదితర వైద్య పరీక్షలను గాంధీ హాస్పటల్స్‌ వైద్యులు డాక్టర్‌ శ్రీలక్ష్మి, గవర్నమెంట్‌ హాస్పటల్‌ వైద్యులు డాక్టర్‌ కోటేశ్వరరావు, శ్రీరాం, శ్రేయా కిడ్ని సెంటర్‌ డాక్టర్‌ సుమతి ప్రియ, డాక్టర్‌ అమిత్‌ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. డివిజన్‌ కార్పొరేటర్‌ గొందేశి మాధవి హరినాథ్‌రెడ్డి చేతుల మీదుగా మందులు పంపిణీచేశారు. ఈసందర్భంగా శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్‌ మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here