ఆల్‌ బ్యాంక్‌ కాలనీలో మంచినీటికై అగచాట్లు 

0
201
మూడు రోజులుగా నిలిచిన సరఫరా
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 15 : స్ధానిక 10 వ డివిజన్‌ ఆల్‌ బ్యాంక్‌ కాలనీలో గత మూడు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేయడంతో కనీసం త్రాగునీరు కూడా లభ్యం కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా చేయకపోవడంతో మంచినీటి కోసం నానా అగచాట్లు పడవలసి వస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నీటి సరఫరా నిలిపివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకుని మంచినీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here