ఆశయం ఆకృతి దాల్చిన వేళ..

0
196
గిరిజన ప్రాంతంలో విద్యా సొబగులు
దత్తత గ్రామంలో సొంత నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించిన గన్ని కృష్ణ
స్వహస్తాలతో ప్రారంభించిన గుడా చైర్మన్‌
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని పెదభీంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ తన తండ్రి పేరిట సొంత నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి నుంచి గ్రామస్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయన క షి చేస్తున్నారు.అందులో భాగంగా చిన్నారుల విద్యాభ్యాసం నిమిత్తం గన్ని క ష్ణ తన తండ్రి గన్ని సత్యనారాయణ మూర్తి పేరిట సొంత నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ క తజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ సేవే లక్ష్యంగా తమ ట్రస్ట్‌ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయ లబ్ది కోసం అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం తనకు లేదని, చంద్రబాబు ఇచ్చిన పిలుపును అందుకుని గ్రామాన్ని దత్తత తీసుకున్నామన్నారు. పాఠశాల భవనం నిర్మించేందుకు చాలా ఆటంకాలు స ష్టించారని,వాటిని అధిగమించి నిర్మించామన్నారు. ప్రస్తుతం ఎలిమెంటరీ  పాఠశాలగా ఉన్న ఈ స్కూల్‌కి హైస్కూల్‌ హోదా తీసుకువచ్చేలా క షి చేస్తామన్నారు. పాఠశాలకు వచ్చే రహదారి అస్తవ్యస్తంగా ఉన్నందున త్వరలోనే రోడ్డు నిర్మించేలా సంబంధిత అధికారులతో మాట్లాడతానని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు  వీరభద్రరావు, మండల పార్టీ అధ్యక్షులు బాబురావు, సర్పంచ్‌ కందికొండ గౌరీశ్వరి, గ్రామ కమిటీ సభ్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here