ఆశా దృక్పథంతో పరీక్షలకు సన్నద్ధం కండి

0
173
టెన్త్‌ విద్యార్థులకు డా. రామారెడ్డి సూచన
రాజమహేంద్రవరం, మార్చి 5 : ఈ నెలలో పదవ తరగతి వార్షిక పరీక్షలను వ్రాసే విద్యార్థులు నిరాశావాదాన్ని విడనాడి ఆశావాదంతో పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని మానసిక నిపుణులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి సూచించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకళాకేంద్రంలో ఈరోజు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఆయన ప్రత్యేక శిక్షణతోపాటు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నగరపాలక సంస్థ మేనేజర్‌ శ్రీనివాసరావు, పాఠశాలల పర్యవేక్షకులు పి.దుర్గా ప్రసాద్‌ విద్యార్థులకు తరగతి విశేషాలను వివరించారు. నిత్య విద్యార్థిగా డాక్టర్‌ కర్రి రామారెడ్డి రాజమహేంద్రవరంలో ప్రత్యేకత సంతరించుకున్న విషయాన్ని విద్యార్ధులకు వివరించారు. ఈ నెలలో పదో తరగతి పరీక్షలను వ్రాస్తున్న విద్యార్థులకు తనదైన శైలిలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పరీక్షలను ఎలా వ్రాయాలో కూలంకుషంగా వివరించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ సబ్జెక్ట్‌లలో సమస్యలపై తగు సమాధానాలను పొందాలని అన్నారు. నూతన విషయాలను చదవరాదని, పాత ప్రశ్న పత్రాలలో ప్రశ్నలకు సమాధానాలు ముందుగా చదవాలన్నారు. ప్రణాళికా బద్ధంగా చదవాలని, ప్రశ్న పత్రంలో ఉన్న ప్రశ్నలకు ఉన్న మార్కుల ఆధారంగా చదవాలి, రివిజన్‌ చేసేటప్పుడు సమయ పాలన అనుసరించాలని, రాత్రి సమయాలలో కొద్దిపాటి పోషకాహారం తీసుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here