ఆ ముగ్గురికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది

0
277
చంద్రబాబుకు ప్రజలంతా అండగా నిలవాలి
24వ డివిజన్‌లో తెదేపా నగర దర్శినిలో  గన్ని, ఆదిరెడ్డి పిలుపు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : ఆంధ్రులను నమ్మించి ద్రోహం చేసిన బిజెపికి, పరోక్షంగా వారికి మద్దతుగా నిలుస్తున్న పవన్‌, జగన్‌లకు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 24 డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నగరదర్శిని కార్యక్రమాన్ని కార్పొరేటర్‌ బెజవాడ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎన్‌.టి.ఆర్‌.విగ్రహానికి గన్ని, ఆదిరెడ్డి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటారన్న ఉద్దేశంతో సిఎం చంద్రబాబు గత ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకున్నారని,అయితే అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను తుంగలోకి తొక్కారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి, ప్రజలకు తీరని ద్రోహం చేశారని, వారిపై జాతీయ స్థాయిలో పోరాడుతున్న చంద్రబాబుపై జగన్‌, పవన్‌ లతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మరోవైపు దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అస్థిరపరిచే ప్రయత్నాలను మోడీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుస్తున్నారని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగిన నేపధ్యంలో అందరూ చంద్రబాబుకు అండగా నిలవాలని కోరారు.ఆదిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న కృషిని బిజెపి, వైకాపా, జనసేనలు చూసి ఓర్వలేక రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారని, అయితే తెలుగుదేశం పార్టీకి ప్రజలే అండ దండ అని అన్నారు.మేయర్‌ మాట్లాడుతూ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న చంద్రబాబుని మళ్ళీ ఆశీర్వదించాలని, ఆయన వస్తేనే రాష్ట్రం అభివ ద్ధి చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో  పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, ఆదిరెడ్డి వాసు, కోరుమెల్లి విజయశేఖర్‌, రెడ్డి పార్వతి, బొచ్చా శ్రీను, నాయుడు సూర్య, మెహబూబ్‌ ఖాన్‌, దమర్‌ సింగ్‌ బ్రహ్మజీ, కర్రి కాశి విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here