ఇండియన్‌ క్రిస్టియన్‌ బోర్డు ఏర్పాటుచేయాలి : యుఎన్‌సిసి

0
324
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 : క్రైస్తవుల కోసం ఇండియన్‌ క్రిస్టియన్‌ బోర్టు (ఐసిబి) ఏర్పాటు చేయాలని యునైటెడ్‌ నేషనల్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షులు దడాల సామ్యూల్‌, ఛైర్మన్‌ అంగర జాషువా పట్టాబి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జివి ప్రసాదరావు, ప్రొఫెసర్‌ షడ్రక్‌, డాక్టర్‌ కె అబెద్నగోలు కోరారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ క్రైస్తవుల కొరకు బోర్డు ఏర్పాటుచేసి దాని ద్వారా  సంక్షేమ కారక్రమాలు చేపట్టాలన్నారు. ముస్లిం ఇమామ్‌లు, ఆలయ పూజారులకు గౌరవ వేతం అందిస్తున్న విధంగా పాస్టర్‌లకు కూడా గౌరవ వేతనం అందించాలన్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉందని, అయితే దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే వారిని బిసి-సిలో కలపడం అనేది మత స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. దళత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపినప్పటికీ అంతటితో ఆగకుండా కేంద్రంలో రాజ్యాంగ సవరణ జరిగేటట్లు చూడాలని కోరారు. స్వచ్ఛందంగా మతమార్పిడిలకు అవకాశం ఇవ్వాలన్నారు. చర్చిలు నిర్మించుకోవడానికి రూ.2లక్షలు ఆర్ధిక సహాయం పధకం ఏర్పాటుచేసిన, అందులో నిబంధనలు కఠినంగా ఉండటం కారణంగా ఆ పధకం వినియోగించుకోలేకపోతున్నామని, నిబంధనలు సరళతరం చేయాలన్నారు. క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంక్‌గా చూడకుండా వారి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలన్నారు. చట్టసభల్లో క్రైస్తవుల సమస్యలపై తమ గళం విన్పించేందుకు ఎమ్మెల్యే, ఎంఎల్‌సి సీట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కోటి 25 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారని వారి సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. ఇళ్ళు, చర్చిలు నర్మించుకోవడానికి పాస్టర్‌లకు ఇళ్ళ స్ధలాలు మంజూరు చేయాలని కోరారు. దేశంలోని క్రైస్తవులు అందిరిని ఒక వేదికపైకి తీసుకువచ్చి వారి సమస్యలపై పనిచేయడానికి యుఎన్‌సిసి ఏర్పడిందని తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here