ఇది అనవసర పిటీషన్‌

0
170
వంద శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం
న్యూఢిల్లీ, మే 21 : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు 100 శాతం సరిపోలేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది అనవసర పిటిషన్‌ అని, దీన్ని మేం విచారించబోమని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేత త్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చెన్నైకు చెందిన టెక్‌ ఫర్‌ ఆల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేత త్వంలోని విస్త త ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెల్లడించింది. మళ్లీ ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిటిషన్‌ తీసుకొచ్చారు. సీజేఐ తీర్పును మేం అధిగమించలేం. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో మేం జోక్యం చేసుకోలేం. ఇలాంటి అర్థం లేని పిటిషన్‌ను మేం విచారించబోం. దీన్ని కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసం వెల్లడించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పరిగణనలోకి తీసుకునే వీవీప్యాట్‌ల సంఖ్యను కనీసం 50శాతానికి పెంచాలంటూ ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌లను లెక్కిస్తే సరిపోతుందంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here