ఇది కేవలం పంతం

0
51
(శనివారం నవీనమ్‌)
వైసిపి ప్రభుత్వం తలపెట్టిన రాజధాని తరలింపు ఇప్పటికైతే నిలిచిపోయింది. సెలెక్టు కమిటీకి పంపాలన్నలేఖ టిడిపి సకాలంలో మండలి ఛైర్మన్‌కు అందజేసిందా, నిర్ణీత గడువు లోపల బిల్లులకు సవరణలుప్రతిపాదించిందా, ఛైర్మన్‌ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించడం నరైనదేనా అనే సాంకేతికాంశాలనుకాసేపు పక్కనపెడదాం! శాసనసభ ఎలాగో మండలి కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం. రాజ్యాంగబద్ధంగానే కౌన్సిల్‌ఏర్పాటైంది. మండలిలో తమకు మెజార్టీ లేదు కనుక, తామనుకున్నది నెగ్గదు కనుక మొత్తానికే మండలిలోప్రజాస్వామ్యం లేదనే వైసిపి వాదన అసంబద్ధం. తమకు మెజార్టీ ఉన్న చట్ట సభలోనే ప్రజాస్వామ్యంపరిఢవిల్లుతుందని, లేని చోట ప్రజాస్వామ్యం చనిపోయిందనీ గగ్గోలు పెట్టడం పిచ్చివాదన. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా అమరావతికి భూములిచ్చిన రైతులకు పరిష్కారం చూపకుండామూడ రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) చట్ట ఉపసంహరణబిల్లులను ప్రభుత్వం చట్ట సభల్లో ప్రతిపాదించింది. తమ పార్టీకి బలం ఉన్నందున శాసనసభలో బిల్లులను నెగ్గించుకుంది. శానన మండలిలో తమకు బలంలేదని తెలిసి కూడా తాము చెప్పింది జరిగి తీరాల్సిందేనన్న పంతంతో బిల్లులను ప్రవేశపెట్టింది. రెండు బిల్లులను మరింత అధ్యయనం నిమిత్తం మండలి ఛైర్మన్‌ సెలెక్టు కమిటీకి నివేదించడంతో అప్రతిష్టపాలైంది. కాగా ప్రతిపక్ష టిడిపి, కౌన్సిల్‌లో తమకు ఉన్న సంఖ్యాబలంతో సర్కారీ బిల్లుల అడ్డుకోగా, టిడిపిప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ అధికారపక్షం నిప్పులు చెరుగుతోంది. ప్రజాస్వామ్యంపై ఇంతగా పెడబొబ్బలు పెడుతున్న వైసిపి సర్కారు రాజధాని తరలింపు అంశంపై ఏంచేసింది? నేరుగా అసెంబ్లీలో బిల్లులు పెట్టింది. ఎన్నుకున్న ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకుప్రయత్నించలేదు. జిఎన్‌రావు, బోస్టన్‌, హైపవర్‌ కమిటీల నివేదికలను రహస్యంగా ఉంచింది. అమరావతికిభూములిచ్చిన రైతుల వినతులు వినడానికి కనీస సమయం ఇవ్వలేదు. అఖిలపక్ష సమావేశాలునిర్వహించలేదు.  రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన రాజధానిపై గోప్యత పాటించడం ఏ విధంగాప్రజాస్వామ్యం అవుతుందో ప్రభుత్వమే చెప్పాలి.  మండలిలో మెజార్టీ కలిగిన ప్రతిపక్ష టిడిపి రాజధాని తరలింపు బిల్లులను అడ్డుకోవడం ద్వారా వైసిపిప్రభుత్వ అస్పష్ట, అప్రజాస్వామిక ప్రయత్నాలకు చెక్‌ పెట్టడం మంచిదే. అయితే ఈ ఒక్క ఉదంతంతోనే కేపిటల్‌ విషయంలో టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఒప్పులైపోవు. అప్పటి అప్రజాస్వామిక చర్యలు మాసిపోయేవీకావు. ఇప్పటిలానే అప్పుడు కూడా టిడిపి సర్కారుప్రజాభిప్రాయ సేకరణ, అఖిలపక్ష సమావేశాలు లేకుండానే అమరావతిని ప్రకటించింది. అప్పుడూ రాజధానివ్యవహారం మొత్తం నిగూఢంగా సాగింది. చట్టబద్ధంగా నెలకొల్పిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక చర్చకురాలేదు. మంత్రులతో కమిటీని వేసి మమ అనిపించింది. అయినప్పటికీ ఉభయ సభల్లో, బయటా అమరావతి విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వచ్చింది. అమరావతిలో రాజధాని నిర్మాణం చాలా వరకు జరిగింది. మళ్లీ ఇక్కడి నుంచి రాజధానిని వైసిపి ప్రభుత్వంఎందుకు తరలించాల్సి వస్తోందో హేతుబద్ధంగా వివరించడంలో విఫలమైంది. ముంపు ప్రాంతమని, ఖర్చుఎక్కువని చేస్తున్న వాదనలకు బలం లేదు. విశాఖపట్నానికి పాలనా రాజధానిని మార్చినంత మాత్రాన ఆటోమేటిక్‌గా అక్కడ అభివృద్ధిజరిగిపోతుందన్న భ్రమలు కల్పించడమూ మంచిది కాదు. అన్నేసి వేల ఎకరాలు, నవ నగరాల పేరుతో టిడిపిసర్కారు ప్రతిపాదించిన నమూనా ఏవిధంగా పొరపాటు ధృక్పథం నుంచి రూపొందిందో, మూడురాజధానుల ప్రతిపాదనా మరో పొరపాటు ధృక్పథం నుంచి తలెత్తినదే. అతి కేంద్రీకరణ వైపు చంద్రబాబుప్రభుత్వం లాగితే, వికేంద్రీకరణ పేరుతో ఏకంగా రాజధానిని మూడు ముక్కలు చేయడం జగన్‌ ప్రభుత్వవిధానమైంది. ఈ రెండూ ప్రజలను మభ్యపెట్టడానికి, గందరగోళ పరచడానికి గురి చేయడం మినహారెండింటిలోనూ శాస్రీయత, వాస్తవికత లేవు. అమరావతికి భూములిచ్చిన వేలాది రైతు కుటుంబాలకు న్యాయం చేసే విషయంలో వైసిపి, టిడిపి, బిజెపిఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం వాటి రాజకీయ హ్రస్వదృష్టిని అద్దం పడుతుంది. హైదరాబాద్‌లోని సంపన్నప్రాంతం జూబ్లీహిల్స్‌ వలే రాజధాని గ్రామాలను మారుస్తామని నాటి టిడిపి ప్రభుత్వం రైతులకు చెప్పి ల్యాండ్‌పూలింగ్‌కు పాల్పడింది. ఇప్పటి వైసిపి సర్కారు రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తుందో చెప్పకుండాతరలింపు యత్నాలు మొదలుపెట్టింది. సమీకరించిన భూములను ఏం చేస్తారు? రైతులను ఏం చేస్తారు? ఈప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కౌలు పెంపు, చెల్లించే గడువు పెంపు వంటివి కంటి తుడుపుకూడా కాదు. అధికారపక్షంపైకి రైతులను ఎగదోయడమే తప్ప బాధిత రైతుల సమస్యల పరిష్కారమేమిటో చంద్రబాబూస్పష్టం చేయడం లేదు. అధికార, ప్రతిపక్షాలు రైతులతో చెలగాటం ఆడుకుంటుండగా, కేంద్రంలోని బిజెపిరాజధాని అంశంతో తమకు సంబంధం లేదని తప్పించుకోవడం దగాకోరుతనం. ఈ వైపరీత్యం ఉండగానేరాజధానిపై రాష్ట్రంలోని బిజెపి నేతలు రాజకీయ లబ్ధి రంధితో ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నారు. వైసిపి, టిడిపి, బిజెపి ఈ మూడు పార్టీలు రైతులను ఆదుకునే విషయంలో సాధించిందేమీ లేదు సరికదాఆవేదనతో రోడ్డెక్కిన రైతులను తమ రాజకీయ క్రీడా విన్యాసాలతో మరింతగా బాధ పెడుతున్నాయి. మొత్తం రాష్ట్ర పరిపాలన అంతా ఈ వ్యవహారంతో అస్తవ్యస్తం అవుతోంది. ఇది ఎవరికీ మంచిది కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here