ఇది చంద్రన్న పండుగ 

0
169
ప్రజల కళ్ళల్లో ఆనందమే చంద్రబాబు లక్ష్యం
ధవళేశ్వరంలో పింఛన్లు, పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4 : మహిళలకు, వృద్ధులకు, నిరాశ్రయులకు ఇప్పుడు చంద్రన్న పండుగ జరుగుతోందని, అందరి కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోందని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. రూరల్‌ నియోజకవర్గంలోని ధవళేశ్వరంలో ఈరోజు పింఛన్లు, పసుపు – కుంకుమ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గోరంట్ల, గన్ని, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పథకాలలో మార్పులు చేసి మరిన్ని మేళ్ళును సమకూరుస్తున్నారన్నారు. అడగకుండానే పింఛన్లను రెట్టింపు చేశారని, పసుపు-కుంకుమ క్రింద మహిళలకు కానుకగా రూ.10వేలు అందించి అన్నయ్యగా నిలిచారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పనిచేసే ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మార్ని వాసుదేవరావు, యర్రమోతు ధర్మరాజు, కుక్కళ్ళ సత్తిబాబు, అనుసూరి పద్మలత, శీలంశెట్టి శ్రీనివాస్‌, ఆళ్ళ ఆనందరావు, వర్రే రాజేష్‌, తలారి మూర్తి, మజ్జి పద్మ, గరగ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here