ఇది  పెద్ద కొడుకు పండుగ బహుమతి

0
250
చంద్రబాబు చిత్రపటానికి ఫించన్‌దారుల పాలాభిషేకం
రాజమహేంద్రవరం, జనవరి 18 : నిరాదరణకు లోనవుతున్న వారికి, దివ్యాంగులకు,ఆర్ధికంగా వెనుకబడిన వారికి పెద్ద కొడుకుగా సిఎం చంద్రబాబు నిలిచి రెట్టింపు భరోసాతో మరోసారి అండగా ఉన్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక 42వ డివిజన్‌లో సిఎం చంద్రబాబు ప్రకటించిన ఫించన్ల పెంపుపై కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి వెంకట్రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ముఖ్య అతిధిగా గన్ని కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫించన్‌ దారులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వ ధ్దులు, దివ్యాంగులు పాల్గొని బాబు నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ అడగని వరాలను చంద్రబాబు ప్రకటించి అందరిని సంతృప్తిపరుస్తున్నారని అన్నారు.వృద్ధులు,దివ్యాంగులు,వితంతువులు,చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, హిజ్రాలకు ప్రతి నెల ఇస్తున్న ఫించన్లను రెట్టింపు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలు ఏవిధంగా సంతృప్తి చెందుతున్నారో ఐవిఆర్‌ఎస్‌ ద్వారా తెలుసుకుని వారికి ఫించన్‌ రెట్టింపు చేశారని, ప్రతిపక్షాలు ప్రకటించాయన్న కారణంగా బాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనను ఖండించారు.తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల కోసం పని చేస్తుందని, అన్ని వర్గాల సంతృప్తే చంద్రబాబు లక్ష్యమన్నారు. ప్రజల కోసం రేయింబవళ్ళు కృషి చేస్తున్న చంద్రబాబుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, మళ్ళ వెంకట్రాజు, ఎంఎ రషీద్‌, వానపల్లి శ్రీనివాసరావు, సెనివాడ అర్జున్‌, వానపల్లి సాయిబాబా, కంచిపాటి గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here