ఇన్నీస్‌పేట బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ రీసు కృష్ణ కన్నుమూత

0
262
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 :  ది ఇన్నీస్‌పేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, ఆర్యాపురం కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ మాజీ డైరక్టర్‌, గౌడ శెట్టి బలిజ సంఘం నాయకులు రీసు కృష్ణ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  గతంలో సంఘ సేవా కార్యకలాపాల్లో చురుకుగా పనిచేసిన కృష్ణ ప్రస్తుతం రూరల్‌ మండలం కొండగుంటూరులో లక్ష్మీ కృష్ణ బృందావనం పేరిట వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. రీసు కృష్ణ మరణం పట్ల  జిల్లా గౌడ శెట్టిబలిజ సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సంఘం నాయకులు మార్గాని నాగేశ్వరరావు, బుడ్డిగ శ్రీనివాస్‌, రెడ్డి రాజు, పాలిక శ్రీను, కడియాల వీరభద్రరావు, కడియాల వరబాబు, వాసంశెట్టి గంగాధరరావు,కె. పార్ధసారథి, కె.సత్తిబాబు, రాయుడు శ్రీను, నెల్లి సర్వేశ్వరరావు, కోడి ప్రవీణ్‌, బుడ్డిగ రవి, మార్గాని చంటిబాబు, మార్గాని రామకృష్ణ గౌడ్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here