ఇప్పుడు కలర్‌ సినిమా… ఆ తర్వాత చీకటే

0
422
25 వ డివిజన్‌లో కావాలి జగన్‌..రావాలి జగన్‌లో వైకాపా నేతలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 3 : స్థానిక మంగళవారపునేట 25వ డివిజన్‌లో ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ  రావాలిజగన్‌-కావాలి జగన్‌  గడపగడపకు కార్యక్రమం నగర కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు  ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రౌతు జగన్‌ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  డివిజన్‌ నాయకులు నీలపాల  తమ్మారావు, రొక్కం త్రినాథ్‌, వై.ఉదయ్‌భాస్కర్‌, అడపాహరి, బబ్లు, 208,209 బూత్‌ కన్వీనర్లు నున్న వెంకటేశ్వర్లు, పిన్నింటి వెంకటేశ్వరరావు ఏజెంట్లు డివిజన్‌లో గడపగడపకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ద్వారా ప్రతికుటుంబానికి నేరుగా లబ్ది చేకూరే పథకాల కరపత్రాలను అందజేశారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం నాలుగున్నరేళ్ళుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోచుకుని తింటూ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను అన్నా క్యాంటిన్లు, నిరుద్యోగభృతి, డ్వాక్రా రుణమాఫీ అని ప్రజలకు సినిమా చూపించి మోసం చేస్తున్నారని, ఇది ప్రజలు అవగతం చేసుకోకుంటే ఆ తర్వాత మళ్ళీ మోసం చేస్తారన్నారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, గుర్రం గౌతమ్‌, సయ్యద్‌ హసీనా, గుడాల ఆదిలక్ష్మి, షేక్‌ షబ్నమ్‌, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి వాకచర్ల కృష్ణ, కాటం రజనీకాంత్‌, పెదిరెడ్ల శ్రీనివాస్‌, మోహిద్దిన్‌పిచ్చాయ్‌, స్వరూప్‌, గూడాల ప్రసాద్‌, అందనాపల్లి సత్యనారాయణ, షేక్‌ మస్తాన్‌, షేక్‌ ఖాన్‌, కస్సేరాజేష్‌, వంకాయల సత్తిబాబు, సుభాష్‌, జానీ, బాషా, గుదే రఘునరేష్‌, యడ్ల రామారావు, మేడబోయిన సునీల్‌, కట్ట సూర్యప్రకాశరావు, ఉప్పాడ కోటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here