ఇబ్బందులున్నా నిరాటంకంగా సంక్షేమ పథకాలు

0
278
చంద్రన్న క్రిస్మస్‌ కానుకల పంపిణీలో గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 22 : కూర్చోవడానికి కుర్చీ, ఉండటానికి కార్యాలయం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు క్రమం తప్పకుండా సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు  చౌక ధరల దుకాణాల ద్వారా కానుకలు అందిస్తున్నారని, ఒకవైపు సంక్షేమం, మరో వైపు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా రోజుకు 18 గంటలు శ్రమిస్తున్న ఆయనకు అంతా అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ పిలుపు ఇచ్చారు.  స్ధానిక 42 వ డివిజన్‌లోని చౌక ధరల దుకాణం నెంబర్‌ 25 వద్ద ఈరోజు చంద్రన్న క్రిస్మస్‌ కానుకలు అందించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న  గన్ని కృష్ణ మాట్లాడుతూ క్రిస్మస్‌ పండుగను పిండి వంటకాలతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతో ఆరు రకాల  వస్తువులను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు.  గతంలో ఇచ్చిన కానుకల్లో నాణ్యత లోపించిందనే విమర్శలు రావడంతో ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో కూడిన సరకులను పంపిణీకి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆర్థిక లోటు ఉన్నా ప్రజా సంక్షేమానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పథకాలు అమలు చేస్తున్నారని , అటువంటి సమర్ధత కల  చంద్రబాబునాయుడికి, వారి  కుటుంబ సభ్యులకు యేసు క్రీస్తు శారీరక, మానసిక  బలాన్ని  ఇచ్చేలా ప్రార్థనలు చేయాలని కోరారు. తెదేపా డివిజన్‌ అధ్యక్షుడు మళ్ళ వెంకట్రాజు 2007  ఎన్నికల్లో ఓటమి పాలైనా  డివిజన్‌ను విడిచిపెట్టకుండా పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండటం వల్ల 2014 ఎన్నికల్లో ఆయన సతీమణి నాగలక్ష్మీని గెలిపించుకున్నారని  చెప్పారు. 42 వ డివిజన్‌లో  85 గృహాలు, 475 రేషన్‌ కార్డులు, 54  ఫించన్లు కొత్తగా మంజూరు చేయడం జరిగిందని, వచ్చే నెల 2 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డులు, ఫించన్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.ఇటీవల పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మళ్ళ వెంకట్రాజు 1150 సభ్యత్వాలు నమోదు చేసి అన్ని డివిజన్లకు స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఫించన్‌దారులకు ఈ నెల ఇబ్బందులు ఎదురయ్యాయని, వచ్చే నెల నుంచి నగదు రూపంలోనే ఫించన్‌దారులకు అందించడం జరుగుతుందన్నారు. నగదు రహిత లావాదేవీల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని గన్ని సూచించారు. కాళీ స్పెషల్‌ నగర పాలక సంస్ధ పాఠశాలలో వంట షెడ్డు నిర్మాణానికి సంబంధించి కమిషనర్‌ను కోరతామని, వారికి  కుదరకపోతే స్పందన స్వచ్చంధ సేవా సంస్థ ద్వారా సొంత నిధులతో  నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రన్న క్రిస్మస్‌ కానుకలను అందించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మళ్ళ నాగలక్ష్మీ, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మళ్ళ వెంకట్రాజు, శెనివాడ అర్జున్‌, వానపల్లి సాయిబాబా, వానపల్లి శ్రీనివాస్‌, ఎంఏ రషీద్‌, మొండి సత్యనారాయణ, మొండి అనిత, రేషన్‌ డీలర్‌ మీరా భాయ్‌ తదితరులు పాల్గొన్నారు.