ఇమంది కన్నారావుకు బిసి సంఘం మద్దతు

0
330
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : నగర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జి అప్పారావు అధ్యక్షతన బిసి సంక్షేమ సంఘం సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు బిసి సమస్యలపై చర్చించిన మీదట త్వరలో జరగబోవు జాంపేట కోపరేటివ్‌ బ్యాంక్‌ ఎలక్షన్స్‌లో రాజమండ్రి బిసి సంఘం నాయకులు ఇమంది కన్నారావును డైరెక్టర్‌గా పోటీ చేయించడానికి నగర బిసి సంక్షేమ సంఘం తరపున ఆనం రోటరీ హాలులో మీటింగ్‌కు హాజరైన సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో నగర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జి అప్పారావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బిసిలకు అనేక సేవలు చేస్తున్న ఇమంది కన్నారావుని జాంపేట కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎలక్షన్స్‌లో డైరెక్టర్‌గా బిసిల తరపున నిలబెట్టినందుకు ఆయన గెలుపుకు అందరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్ధి నాయకుడు దుర్గా యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి గంగుల సూర్యారావు, రాజమండ్రి నగర ప్రధాన కార్యదర్శి ఎం.డి.మున్నా, జిల్లా ఉపాధ్యక్షులు దొమ్మేటి సోమశంకరరావు, బట్రాజుల అధ్యక్షులు వెంకట్రాజు, నాగలక్ష్మి, గోలి రవి, లంక నరేష్‌, ఓం.నూకరాజు, గాంధీ తదితరులు పాల్గొన్నారు.