ఇలా ఎవరు పనిచేయగలరు ?

0
173
అది చంద్రబాబుకే సాధ్యం…కష్టాన్ని గుర్తించి మద్ధతు ఇవ్వండి
47 వ డివిజన్‌లో తెదేపా నగర దర్శినిలో గన్ని కృష్ణ, ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 13 : ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమయ్యే ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కృషి చేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబునాయుడేనని, ఆయన కష్టాన్ని, ఆయనపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనించాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్ధానిక 47 వ డివిజన్‌లో కవులూరి వెంకట్రావ్‌ ఆధ్వర్యంలో తెదేపా నగర దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా భారతరత్న బి.ఆర్‌. అంబేద్కర్‌, తెదేపా వ్యవస్థాపకులు ఎన్‌ టి రామారావుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గన్ని మాట్లాడుతూ  శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు అక్కడే ఉండి ఉన్నతాధికారులను అక్కడకు పిలిపించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను వేగవంతం చేశారని అన్నారు. పరిస్థితులు అదుపులో వచ్చే వరకు తాను అక్కడే ఉంటానని ప్రకటించి నిర్విరామంగా ప్రజలకు కావలసిన సహాయ సహకారాలను అందిస్తున్నారని తెలిపారు.దేశంలోనే అటువంటి ముఖ్యమంత్రి లేరని, ఆయన అందిస్తున్న సేవలను కొనియాడవలసిన నాయకులు విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇటీవల తెలంగాణాలో ఆర్టీసి బస్సు లోయలో పడి 60 మందికి పైగా మరణిస్తే అక్కడి సీఎం కెసిఆర్‌ కనీసం ప్రమాద ప్రాంతానికి వెళ్ళకపోవడమే కాక బాధిత కుటుంబాలను పరామర్శించలేదన్నారు. జగన్‌, పవన్‌లు తిత్లీ తుపాను కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి గురించి కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదని అన్నారు. సీఎం చంద్రబాబుకు అండగా ఉండే  నాయకుల ఇళ్ళపై, కార్యాలయాలపై మోడీ సర్కార్‌ ఆదాయపు పన్ను శాఖ అధికారులతో దాడులు చేయిస్తోందని, మోడీ, అమిత్‌షాలు అవినీతి అక్రమ సంపాదన వారికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రాన్ని ఎదిరించిన చంద్రబాబును, తెదేపా నేతలను కేంద్రం బెదిరిస్తున్న తీరును ప్రజలు గమనించాలన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు ఎదుర్కొంటారని, తెలుగుజాతి మనుగడ, ఆత్మగౌరవం కోసం  ఎవరితోనైనా పోరాడేందుకు ఆయన వెనుకాడబోరని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, ఆదిరెడ్డి వాసు, మరుకుర్తి రవియాదవ్‌, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పాలవలస వీరభద్రం, పార్టీ నాయకులు పితాని కుటుంబరావు, బొమ్మనమైన శ్రీనివాస్‌, బొచ్చా శ్రీను, పెయ్యల శ్రీను, మహబూబ్‌ ఖాన్‌, పిడిమి ప్రకాష్‌, విజ్జిన సుధాకర్‌, మేరపురెడ్డి రామకృష్ణ, పుట్టా సాయిబాబా, జాగు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here