ఇళ్లపై బ్యాంకు రుణం మాఫీ

0
214
పేదల ఇళ్లలో కూడా చంద్రబాబు లంచాలు తీసుకుంటున్నారు.
బాబుతో ఓటుకు బుద్ధి చెప్పండి – ప్రజలకు వైసిపి అభ్యర్ధి రౌతు పిలుపు
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 1 : పేదల ఇళ్లపై కూడా సిఎం చంద్రబాబు లంచాలు తీసుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ సిపి రాజమహేంద్రవరం శాసనసభ అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావు ఆరోపించారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మాణంలో చదరపు అడుగు ధర రూ 2 వేలకు కాంట్రాక్టర్లకు అప్పగించారని ధ్వజమెత్తారు. మార్కెట్‌లో చదరపు అడుగు ధర రూ. వెయ్యి ఉండగా చంద్రబాబు మాత్రం రూ. 2 వేలు ఇస్తూ ఒక్కొక్క ఇంటిపై మూడు లక్షలు మామూళ్లుగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన 10, 11 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ పేదల ఇళ్లపై బ్యాంకు రుణం రూ. 3 లక్షలు 20 ఏళ్ల తరబడి చెల్లించాల్సిన తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయం తెలిసిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తాము అధికారంలోకి వస్తే బ్యాంకు రుణాలు రూ.3 లక్షలు మాఫీ చేస్తామని ఇప్పటికే ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తుచేసారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇచ్చి, ఆ ఇంట్లో మహిళ పేరుతో రిజిష్ట్రేషన్‌ చేస్తామని పేర్కొన్నారు. ఒక ఆస్తిలా ఆ ఇంటిని ఉపయోగించుకోవచ్చన్నారు. 2014 ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆ పార్టీనేత, ప్రముఖ సినీనటుడు జిత్‌మోహన్‌ మిత్ర పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సిపి నవరత్నాలతో ప్రతీ కుటుంబం లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు. అర్హత ఆధారంగా పథకాలు అందచేస్తారని వివరించారు. కార్యక్రమంలో 10వ డివిజన్‌ నేతలు నరవ గోపాలకృష్ణ,  చిన్ని, సింగర్‌ వెంకటేశ్వరరావు, 11వ డివిజన్‌ నేతలు కర్రి సతీష్‌, వరదా కిరణ్‌, పార్టీ నేతలు మేడపాటి షర్మిలారెడ్డి, మెహిద్దీన్‌ పిచ్చయ్‌, పడాల శ్రీను, కుక్కా తాతబ్బాయి, కట్టా శ్రీను, తలుకూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here