ఇసుక సమస్యపై 14న చంద్రబాబు 12 గంటల దీక్ష 

0
115
విజయవాడ, నవంబర్‌ 5 : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కొరతపై ఈ నెల 14న దీక్ష చేపట్టాలని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేస్తారని పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. ఇసుక సమస్యపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ఆ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీక్షలో తెదేపా  ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, మాజీలు పాల్గొంటారు. ఇసుక సమస్య కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా ఇసుక వెంటనే అందుబాటులోకి తేవాలని కోరుతూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించగా ఆ కార్యక్రమానికి తెదేపా మద్ధతు ప్రకటించి అందులో పాల్గొంది. అయితే తాజాగా చంద్రబాబు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here