ఇసుక సరఫరాలో జగన్‌ సర్కార్‌ ఘోర వైఫల్యం

0
129
కార్మికుల కష్టాలు మీకు పట్టవా? : తెదేపా ఆధ్వర్యంలో ర్యాంప్‌ వద్ద ధర్నా
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 11 :  సహజ సిద్ధంగా లభించే ఇసుకను సామాన్యులకు అందుబాటులో ఉంచడంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విమర్శించారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉదయం స్థానిక కోటిలింగాల పేట ఇసుక ర్యాంప్‌ వద్ద నిరసన వ్యక్తం చేసారు. శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ఇసుక ర్యాంప్‌ వద్ద ధర్నా నిర్వహించారు.  రాజమహేంద్రవరంలో అవసరమైన మేరకు ఇసుక అందుబాటులో ఉన్నా ఇక్కడ ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని భవానీ మండిపడ్డారు. ఇసుక పాలసీని సక్రమంగా అమలుచేయకపోవడం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. నిర్మాణ రంగం కుదేలైందని, దాని అనుబంధ రంగాల్లోనూ ఇసుక సరఫరా లేక ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఇసుక సరఫరాపై ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియచేయాలని  డిమాండ్‌ చేశారు. రాజన్న రాజ్యం తెస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌ పాలన మాట దేవుడెరుగు కార్మికుల కడుపు మాడ్చే పనిలో మాత్రం నిమగ్నమైనట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.  మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సంక్షేమ ఫలాల మాట దేవుడెరుగు.. పేదల అన్నార్తిని లెక్క చేయకుండా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు. రాజన్న బాటలో పాలన సాగిస్తానని చెప్పుకొచ్చే జగన్‌ ఆ బాట వదిలి పెడదోవ పట్టారనే విషయం ప్రస్తుత పాలనకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతానికి ఇసుక సరఫరా నిలిచిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడా నిర్మాణాలు సాగడం లేదని పేర్కొన్నారు. ఇసుక మాఫియాకు చెక్‌ పెడతామని ప్రభుత్వం ఒక పక్క చెబుతోందని, అయితే ఆ పార్టీకి చెందిన నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ అధికారులపై దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.   చాంబర్‌ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు,ఆదిరెడ్డి వాసు, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, సింహా నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, తంగెళ్ల బాబి,  పాలవలస వీరభద్రం,  పితాని కుటుంబరావు, మానే దొరబాబు, బొచ్చా రమణ, షేక్‌ సుభాన్‌, ఎండి మహబూబ్‌ ఖాన్‌, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, నిమ్మలపూడి గోవిందు, ఉప్పులూరి జానకి రామయ్య, అరిగెల బాబూనాగేంద్రప్రసాద్‌, బూరాడ భవానీ శంకర్‌, కడితి జోగారావు, బుడ్డిగ గోపాలకృష్ణ, రవి, కొమ్మా రమేష్‌, నాయుడు సూర్య, మరుకుర్తి దుర్గాయాదవ్‌, మరుకుర్తి రవియాదవ్‌, సత్తి వెంకట సాయి సందీప్‌, చాపల చినరాజు, బేసరి చిన్ని, బొచ్చా శ్రీను, కవులూరి వెంకటరావు, అట్టాడ రవి, తురకల నిర్మల, ఆశపు సత్యనారాయణ, విజ్జన సుధాకర్‌, ప్రకాష్‌, శ్రీను, కాశీ విశ్వనాధం, ధన తదితరులు పాల్గొన్నారు. ఇసుక సరఫరాకు సంబంధించిన విషయాలను నేతలు వీఆర్‌ఓలను అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here