ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై హస్తిన వేదికగా పోరు

0
139
ఢిల్లీ వెళ్ళిన సీఎం చంద్రబాబు- జాతీయ నేతలతో భేటీ
అమరావతి, మే 17 :  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఢిల్ల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ వ్యవహారాన్ని సీఈసీ ద ష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల విషయంలో ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని హస్తిన వేదికగా సీఎం నిరసన తెలపనున్నారు. ముఖ్యంగా ఏపీలో పలు చోట్ల రీ పోలింగ్‌ విషయంలో తమ విజ్ఞాపనలను పట్టించుకోకుండా ప్రతిపక్ష వైకాపా ఫిర్యాదులపైనే ఈసీ చాలా వేగంగా స్పందించి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఢిల్లీలో జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్ళి పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళనున్నారు. పర్యటనలో వీలుంటే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశముంది. విపక్ష పార్టీల సమావేశానికి ఆహ్వానాలు పంపాలనే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఎల్‌జేడీ అధినేత శరద్‌యాదవ్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశముంది. దిల్లీ నుంచి చంద్రబాబు లక్నో వెళ్లి మాయావతితో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here