ఈ పోరులో ధర్మానిదే విజయం 

0
314
వైకాపా సిటీ అభ్యర్థి రౌతు నామినేషన్‌
రాజమహేంద్రవరం, మార్చి 22 : రానున్న రోజుల్లో జగనన్న రాజ్యం రావడం ఖాయమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి రిటర్నింగ్‌ అధికారి సాయికాంత్‌ వర్మకు రౌతు తన నామినేషన్‌ పత్రాలు అందచేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న నయవంచన, దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వైకాపా అధినేత జగన్‌ను, రాజమహేంద్రవరం సిటీకి తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశీస్సులతో తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అహర్నిశలు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేసానన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. ఆయన వెంట ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, సిటీ ఇన్‌చార్జ్‌ బాజిరెడ్డి, పార్టీ నాయకులు బొమ్మన రాజ్‌కుమార్‌, పొలసానపల్లి హనుమంతరావు, పిల్లి సిరిబాల, తలసెట్ల నాగరాజు, సప్పా ఆదినారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు కూడా తరలివచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here