ఈ రాత్రి ఒంటిమిట్ట కోదండ రాముడి కల్యాణోత్సవం 

0
189
ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 18 : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం ఈరోజు రాత్రి కమనీయంగా జరుగగనుంది. బ్రహోత్సవాల్లో కీలకమైన ఈ ఘట్టానికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ ఉత్సవాలకు సీఎం హాజరయ్యేందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కూడా అనుమతి ఇచ్చింది. ఈ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), కడప జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశాయి. సుమారు 1500 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించారు. 1200 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్‌, గౌడ్స్‌ భక్తులకు సేవలందించనున్నారు. ముత్యంతో కూడిన 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందజేసేందుకు సిద్ధం చేశారు. కల్యాణ వేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన నిపుణులను ఇందుకోసం ప్రత్యేకంగా రప్పించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో కల్యాణ వేదిక ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ అభిషేక్‌ మహంతి పరిశీలించారు. బందోబస్తు పటిష్ఠంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గత ఏడాది గాలివాన బీభత్సంతో ఇక్కడ ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీనిని ద ష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా ఉండేలా అధికారులు జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు లక్ష మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here