ఉండవల్లి వ్యాఖ్యలు హాస్యాస్పదం

0
213
వెంటనే వెనక్కి తీసుకోవాలి : కాంగ్రెస్‌ డిమాండ్‌
రాజమహేంద్రవరం,ఫిబ్రవరి 26 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదని, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని కాలేరంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన.్‌వి శ్రీనివాస్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ   దేశ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, విభజన హామీలు అమలు కావాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో రెండు దఫాలు ఎంపీగా గెలుపొంది, పలు పదవులు అనుభవించిన ఉండవల్లి ఇప్పుడు రాజకీయ మనుగడ కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశప్రజల మేలు కోరే వ్యక్తులు ఈ విధంగా మాట్లాడరన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారో, ఎప్పుడు ఎవరిని తిడతారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, విభజనచట్టంలోని హామీలు నేరవేర్చడం లేదని, ప్రత్యేక ¬దా ఇవ్వడం లేదని చెబుతున్న ఉండవల్లి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక¬దాపైనే తొలి సంతకం చేస్తానని బహిరంగంగా ప్రకటించిన రాహుల్‌ గాంధీ మాటల్ని స్వాగతించకుండా విమర్శించడం దారుణమన్నారు. కాంగ్రెస్‌తోనే రాజకీయంగా ఎదిగిన ఉండవల్లి కనీసం ఆయన వెంట తిరిగేవారికి కూడా ఎప్పుడు ఏ మేలు చేయలేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా రాహుల్‌ గాంధీని దేశ ప్రధానిగా చేయాలని కలలు కనేవారన్నారు. ఆయన అభిమానిగా వ్యవహరించే ఉండవల్లి వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని రాహుల్‌ గాంధీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉండవల్లి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పిల్లా సుబ్బారెడ్డి, గోలి రవి, కొవ్వూరి శ్రీనివాస్‌, అబ్ధుల్లా షరీఫ్‌, వెలిగట్ల పాండురంగారావు, కుమారి, పట్టాభి, గంగాధర్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, ఎండి షహేన్‌షా, పట్నాల శ్రీనివాస్‌, నలబాటి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here