ఉత్సాహంగా ‘హ్యాపీ సండే’

0
253
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  31 : ప్రతి ఆదివారం ఆనందమయం కావాలన్న ఉద్దేశ్యంతో నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు ఆలోచనతో అమలు చేస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం ఆదివారం ఉదయం పుష్కరఘాట్‌ వద్ద ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ సంస్థ నిర్వహించిన ఫ్లాష్‌ మోబ్‌ అందరినీ అలరించింది. శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు దీపావళి బాణాసంచా తెచ్చి అందరినీ దీపావళి సంబరాలలో ఆనందపర్చారు.