ఉత్సాహభరితంగా నిర్విరామ శాస్త్రీయ నృత్యోత్సవం

0
93
రాజమహేంద్రవరం,నవంబర్‌ 8 : స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌  భాషా – సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నగరానికి చెందిన కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వందగంటల నిర్విరామ శాస్త్రీయ నృత్యోత్సవం ఉత్సాహభరితంగా సాగుతుంది.  బుధవారం ఉదయం ప్రారంభమయిన నృత్యోత్సవం నిరాటంకంగా సాగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాల నుండి హాజరైన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. కళాప్రియ నృత్య కళాక్షేత్రం అధినేత ఆచంట చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.  ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సనాతన సంప్రదాయ నృత్యాల ఔన్నత్యం ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆదివారం రాత్రి వరకు నృత్యోత్సవం జరుగుతుంది. గత మూడు రోజులుగా సాగుతున్న నృత్యోత్సవం శుక్రవారం కూడా కొనసాగింది. ఈ నృత్యోత్సవం ఆదివారం నాటితో నూరు గంటలు పూర్తవుతుంది.  దీంతో నూరు గంటల నిర్విరామంగా సాగుతున్న నృత్యోత్సవం తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేయనున్నారని నిర్వాహకులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here