ఉత్సాహభరితంగా మన చైతన్య వన సమ్మేళనం

0
114
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 :ఎస్‌సి, ఎస్టీ మైనారిటీస్‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం జరిగిన మన చైతన్య వన సమ్మేళనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఐక్యవేదిక కన్వీనర్‌ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ, అర్బన్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ జి.మురళీకృష్ణ, ఎపిఈపిడిసిఎల్‌ డిఈ కె.తిలక్‌ కుమార్‌, నన్నయ యూనివర్శిటీ తెలుగు విభాగం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.సత్యనారాయణ, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభకు స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన నాయకులు కాశీ నవీన్‌కుమార్‌, రాచపల్లి ప్రసాద్‌, విప్పర్తి సర్వేశ్వరరావు, దాసి వెంకట్రావు, వైరాల అప్పారావు, కప్పల వెలుగుకుమారి, రేలంగి శ్రీదేవి, గూటం స్వామి, తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, ఉందుర్తి సుబ్బారావు, కార్యక్రమం నిర్వాహక కమిటీ ప్రతినిధులు బొచ్చా రమణ, జాలా మదన్‌, సమ్మతం గన్నెయ్య, చోటు, తుమ్మల తాతారావు, ఎండి అబ్దుల్లా షరీఫ్‌, ఊబా రాజారావు, కోరుకొండ చిరంజీవి, పతివాడ రమేష్‌, గారా చంటిబాబు, విజ్జిన మధు, ఎస్‌కె ఖాన్‌,ఎలిపే శ్రీనివాస్‌, గుడాల ప్రసాద్‌, తిరగాటి దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here