ఉదాత్త ఆశయంతో గణితాంజలి చిత్రమాలిక

0
191
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 16 : గణిత శాస్త్రానికి జన బాహుళ్యతను, తెలుగుభాషకు జవసత్వాలను అందించే మహోన్నత ఆశయాలతో గణితాంజలి చిత్రమాలిక శ్రేణికి శ్రీకారం చుట్టినట్లు ది ఫ్యూచర్‌ కిడ్స్‌ మేథ్స్‌ లెక్చరర్‌ చింతపల్లి డేవిడ్‌ రాజు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన మానస పుత్రిక ‘గణితాంజలి’ శాస్త్ర సత్యాలలో నిబిడీ క తమైన తాత్విక పార్శ్వాలను ఆవిష్కరిస్తుందన్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్‌ కనుగొన్న గురుత్వాకర్షణ శక్తి సిద్దాంతానికి గణితాంజలి తనదైన శైలిలో విశ్లేషణనిచ్చిందన్నారు. ఇటీవల మరణించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ను, ఇతర శాస్త్రవేత్తలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా గణితాంజలి తొలి సంచిక సత్యాన్వేషి స్వగతమును ప్రదర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here