ఉద్రిక్తతకు దారితీసిన అసెంబ్లీ ముట్టడి పిలుపు

0
141
గృహ నిర్బంధంలో ఆదిరెడ్డి, గన్ని
నల్లా, మేడా తదితరుల హౌస్‌ అరెస్ట్‌
పోలీసుల తీరుపై మండిపడిన నేతలు
రాజమహేంద్రవరం, జనవరి 20 : చలో అసెంబ్లీ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జేఏసీ, వారికి మద్ధతిస్తున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేయడంతో గందగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసులను తిలక్‌రోడ్‌ నివాసంలో, గుడా ప్రధమ చైర్మన్‌ గన్ని కృష్ణను శ్రీరామ్‌నగర్‌లోని నివాసంలో, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావును ఆయన నివాసంలో, ఆర్పీసీ వ్యవస్ధాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ కంబాలచెరువు వద్దనున్న ఇంట్లోను పోలీసులు హౌస్‌ అరెస్టు చేసారు. వారు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా.. వారి ఇంటికి నాయకులు, కార్యకర్తలు రాకుండా బారీకేడ్లు, పోలీసులను మోహరింపచేసారు. పోలీసుల తీరును ఆయా పార్టీల నేతలు తీవ్రంగా నిరసించారు. మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు అనే నినాదంతో అసెంబ్లీని ముట్టడించేందుకు వెళుతున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆదివారం రాత్రి నుంచే వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డగించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,  భారీ ఎత్తున తిలక్‌ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, యువనాయకుడు వాసువారి నివాసం వద్ద బైఠాయించారు. వారికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా నిరసనకు దిగారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసారు. జగన్‌ ప్రస్తుతం అనుభవిస్తున్న ముఖ్యమంత్రి హొదా ప్రజలు ఇచ్చిన అధికారమని, దానిని దుర్వినియోగం చేస్తే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ ప్రజలు అక్కడికే పంపేస్తారని హెచ్చరించారు. బోస్టన్‌, జిఎన్‌ రావు కమిటీలు ఇచ్చిన నివేదికలు ఒట్టి భోగస్సని పేర్కొన్నారు. ఆ నివేదికలు తాము ఇచ్చినవి కాదని ఆయా కమిటీలు చెప్పడంతోనే జగన్‌ ఎంతటి ఘాతుకాని ఒడుకడుతున్నారో అర్ధమవుతోందన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగితే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనన్న భయంతో జగన్‌ ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమాలను అరెస్టులతో అణచివేయలేరని హెచ్చరించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ జైలు జీవితం గడిపిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడం మన దురద ష్టకరమన్నారు. దిక్కు మొక్కు లేకుండా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయయాలను కోవడం అన్యాయమన్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియచేస్తుంటే అరెస్టు చేయడం సబబుకాదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మృతి చెందిన రాజధాని రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధ తం అవుతున్నందునే అమరావతిలో వేలాది మంది పోలీసులను దింపారన్నారు. గుడా ప్రధమ చైర్మన్‌ గన్ని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే గృహ నిర్బంధాలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, బెజవాడ రాజ్‌కుమార్‌, గగ్గర సూర్యనారాయణ, కోసూరి చండిప్రియ, కడలి రామకృష్ణ, యిన్నమురి రాంబాబు, కోరుమిల్లి విజయ శేఖర్‌, కొమ్మా శ్రీనివాస్‌, నాయకులు ఉప్పులూరి జనకిరామయ్యా, మజ్జి రాంబాబు, నక్కా దేవి, కంటిపూడి రాజేంద్రప్రసాద్‌, శెట్టి జగదీష్‌, సూర్య నాయుడు, కొమ్మా రమేష్‌, పితాని కుటుంబరావు, ఇన్నమూరి దీపు, గుత్తుల జయకృష్ణ,  మిస్కా జోగినాయుడు, ఉప్పులూరి కాశి విశ్వనాథ్‌, సుగుణ, తుళ్లి పద్మావతి,కంది కొండ అనంత్‌, ప్రసాద్‌, ఉర్లంక లోకేష్‌, జక్కా ఆదిబాబు, మధు వరప్రసాద్‌, గాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here