ఉన్నతమైన బాధ్యతల్లో అలంకరించాలి దత్తు పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు

0
311
ఉన్నతమైన బాధ్యతల్లో అలంకరించాలి
దత్తు పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు
పలువార్డుల్లో కేక్‌ కటింగ్‌ – స్వర్ణాంధ్రలో అన్నదానం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 22 : అర్బన్‌ జిల్లా బిజెపి అధ్యక్షులు బొమ్ముల దత్తు పుట్టినరోజు వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. స్ధానిక లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన వేడుకల్లో దత్తు పుట్టినరోజు కేక్‌ను కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ దత్తు మరింత ఉన్నతమైన బాధ్యతల్లో అలంకరించాలని ఆకాంక్షించారు. సమాజానికి సేవ చేసే మంచి మనసును భగవంతుడు ఇవ్వాలని కోరుకున్నారు. బిజెపి పార్టీని ఒక సంస్ధగా ఎంచుకుని పార్టీ అభివృద్ధి కోసం, సమాజానికి సేవ చేయాలని సంకల్పంతో దత్తు పనిచేస్తున్నారన్నారు. అనేక మంది కార్యకర్తలను బిజెపిలోకి తీసుకువచ్చి పార్టీ నిర్మాణానికి పాటుపడుతున్నారన్నారు. పుట్టినరోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. దత్తుకు పూలమాలవేసి, బొకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రేలంగి శ్రీదేవి, నగర ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణ, నాయకులు యెనుముల రంగబాబు, నందివాడ సత్యనారాయణ, తక్కెళ్ళ సత్యనారాయణ, నగర బిజెపి మీడియా ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్‌లు బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్ధులకు, కార్యకర్తలకు కేక్‌ను పంపిణీ చేశారు. అనంతరం స్వర్ణాంధ్ర వృద్దులకు అన్నదానం చేశారు. అలాగే 41వ డివిజన్‌లో డివిజన్‌ అధ్యక్షుడు నందివాడ సత్యనారాయణ, ప్రతినిధి వీర వీరాంజనేయులు, 36వ డివిజన్‌లో డివిజన్‌ అధ్యక్షులు తంగెళ్ళ శ్రీనివాసరావు, తంగెళ్ళ పద్మావతి, 6వ డివిజన్‌లో డివిజన్‌ అధ్యక్షులు కొండపల్లి సత్య, రొక్కం పార్వతిల ఆధ్వర్యంలో దత్తు పుట్టనరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో దత్తు పాల్గొని కేక్‌ కట్‌చేశారు. ఈ వేడుకల్లో స్వర్ణాంధ్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గుబ్బల రాంబాబు, బిజెపి నాయకులు గీతా మహాలక్ష్మి, రాయ్డు వెంకటేశ్వరరావు, బేతిరెడ్డి ఆదిత్య, పడాల నాగరాజు, కుంజం వంశీ, దోనేపూడి రవి, బొమ్ముల చందు, వెంకటప్రవీణ్‌, సుబ్రహ్మణ్యం, శివకుమార్‌, వడ్డి నవీన్‌కుమార్‌, వంకా వెంకట్రావు, పండు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.