ఉన్నతాధికారులపై రాజకీయ ఒత్తిడి తగదు : లోక్‌సత్తా

0
266
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడికి గురిచేసి దోపిడీలకు పాల్పడుతున్నారని, ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు యిచ్చిన ఆదేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నగర కన్వీనర్‌ ఎం.వి.రాజగోపాల్‌ అన్నారు. ఎ.వి.అప్పారావురోడ్‌లోని లోక్‌సత్తా కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను రాజకీయ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తే దేశంలో లక్షల కోట్ల మేర రాజకీయ దోపిడీని అరికట్టవచ్చన్నారు. సుప్రీంకోర్టు ఉన్నతాధికారుల కోసం పలు ఆదేశాలను జారీ చేసిందని, వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డి.గంగాధరరావు, యు.శ్రీనివాస్‌, పి.విశ్వనాథం, ఎం.ఎస్‌.రామచంద్రమూర్తి, పి.శివ, తదితరులు పాల్గొన్నారు.