ఉపాధ్యాయులకు ఘన సత్కారం

0
323
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 : స్ధానిక వైఎంవిఏ భవనంలో ఇటీవల గురుపూజోత్సవం సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి సంస్కృతి ఆధ్వర్యంలో  సింహంభట్ల వీరభద్రం, జి.పుష్పావతి అనే ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులు ప్రభాత్‌, 23 వ డివిజన్‌ కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు, క్లబ్‌ రీజియన్‌ చైర్‌ పర్సన్‌ కొల్లూరు గోపాలకృష్ణ, జోనల్‌ చైర్‌పర్సన్‌ కె.శ్రీలక్ష్మీ ప్రసాద్‌, సంస్కృతి మెంబర్లు మాటూరి సిద్ధార్ధ, కళ్యాణి, బొప్పన కృష్ణమూర్తి, నాళం శివరామకృష్ణ, కాకి రామకృష్ణ, పేరయ్య శ్రేష్ఠి, యిన్నమూరి దీపు, పెంటపాటి సుభాష్‌, ఉంగరాల రామకృష్ణ, శ్రీనివాస చక్రవర్తి, క్లబ్‌ కార్యదర్శి తాటిపాక శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.