ఉమ్మడి హైకోర్టు నిర్ణయంపై హర్షం

0
310

రాజమహేంద్రవరం, జనవరి 22 : ఆయేషా కేసు హత్యపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. వీరభద్రపురంలోని సంఘ కార్యాలయంలో సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌ ఖాసిం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయేషా హత్య కేసులో ఆమె తల్లిదండ్రుల పోరాట ఫలితంగా హైకోర్టు స్పందించి తాజాగా దర్యాప్తు చేయాలని ఆదేశించిందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి నిందితులను అరెస్ట్‌ చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు గంగుల సూర్యారావు, ఎం.డి.మున్నా, పిచ్చుక అనిల్‌కుమార్‌, తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, ఉసురుమర్తి రామారావు, సోమిరెడ్డి దేవి, ఎలిపే శ్రీనివాస్‌, బి.రాజ్‌కుమార్‌, జి.పోసయ్య, పులిదిండి ఆనంద్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here