ఉమ్రా యాత్రికులకు సన్మానం

0
165
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 9 : ముస్లింల పవిత్ర స్థలం మక్కా, మదీనా సందర్శనార్ధం  ఉమ్రా యాత్రకు బయలుదేరిన ముస్లింలకు ఈరోజు హజ్రత్‌ సుభాహానీ వలీ దర్గాలో సత్కరం జరిగింది. మక్కా, మదీన యాత్రలకు ఈనెల 13వ తేదీన బయలుదేరి వెళుతున్న సయ్యద్‌ తాజుద్దీన్‌, సయ్యద్‌ గౌసి, సయ్యద్‌ అజీబ్‌, సయ్యద్‌ దాదాలను సయ్యద్‌ హజీ అమీరున్నీషా ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నాయకులు వై శ్రీనివాస్‌లు పాల్గొని ఉమ్రా యాత్రకు వెళుతున్న యాత్రికులకు అభినందనలు తెలిపారు. రాజమహేంద్రవరం నుండి ఉమ్రా యాత్రకు 15 మంది వెళుతుండగా, సుభాహాన్‌ వలీ దర్గా నుండి నలుగురు బయలుదేరి వెళుతున్నారు. ఈనెల 13న మధ్యాహ్నం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ నుండి సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి చెన్నై వెళతారు. అక్కడనుండి 14వ తేదీన మధ్యాహ్నం 2.45 గంటలకు విమానంలో ఉమ్రా యాత్రకు వెళతారు. 12 రోజుల పాటు మక్కా, మదీనా స్ధలాలను సందర్శించి తిరిగి బయలుదేరి వస్తారు. ఈ కార్యక్రమంలో సయద్‌ హజీ అమీరున్నీషా, ఎండి అహ్మద్‌ అలీషా, షేక్‌ అబ్దుల్‌ షలీమ్‌, అబ్దుల్‌ హమీద్‌(వైజాగ్‌), ఎండి దిలావత్‌, ఎండి రవుద్దీన్‌, దర్గా కమిటీ సయ్యద్‌ గౌస్‌ మొహద్దీన్‌, మహ్మద్‌ బాషా, అక్బర్‌, మున్నా, బషీర్‌; తాజుద్దీన్‌, ఇమ్రాన్‌, ఎండి బాషా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here