ఉల్లి ధరలను నియంత్రించాలి : ఎమ్మెల్యే భవానీ

0
74
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 9 : సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఇది అసమర్ధ ప్రభ్వుమని, నిత్యవసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని, సామాన్యులకు తక్షణం ఉల్లిపాయల ధరలను అందుబాటులోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. తన జీవిత కాలంలో ఇంతటి అసమర్ధ ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని, ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ రాష్ట్రాభివృద్ధికి  అడ్డంకిగా మారిందని, తక్షణం డిమాండ్‌ మేరకు ఉల్లి పాయలను సరఫరా చేసి, ఉల్లి ధరలను అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబునాయుడితో పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here