ఊర్వశి కాంప్లెక్స్‌లో ఫన్‌ జోన్‌ ప్రారంభం 

0
459
రాజమహేంద్రవరం, జూన్‌ 30 : గోదావరి జిల్లాల్లో తొలిసారిగా కంప్లీట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఫన్‌ జోన్‌ రాజమహేంద్రవరం రంభ , ఊర్వశి, మేనక కాంప్లెక్స్‌లో  ప్రారంభమైంది. దేశంలోని పలు నగరాల్లో ఫన్‌ జోన్‌లు ప్రారంభించి, సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఎస్‌.అబ్రహం సారధ్యంలో ఈ ఫన్‌ జోన్‌ ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు చెప్పారు. ఎమ్మెల్యేగా ఉండగా గోదావరి లంకలో జంబూ ద్వీపం మాదిరిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటుచేయాలని భావించామని ఆయన గుర్తుచేస్తూ, అబ్రహంతో గల పరిచయంతో చేసిన విజ్ఞప్తికి స్పందించి ఈ ఫన్‌ జోన్‌ ఇక్కడ ఏర్పాటుచేశారని ఆయన చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఊర్వశి కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఫన్‌జోన్‌ ఏర్పాటుచేసిన నేపథ్యంలో పైన కూడా ఫ్లోర్‌ వేసి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో చేస్తామని ఆయన సూచించారు.  ఈ సందర్బంగా అబ్రహం  మాట్లాడుతూ హైదరాబాద్‌ జివికెలో 25వేల గజాల్లో ఫన్‌ జోన్‌ ఏర్పాటుచేశామని,దేశంలో 30సెంటర్లలో ఫన్‌ జోన్‌ లు నిర్వహిస్తున్నామని చెప్పారు. రౌతు చొరవ, వత్తిడితో  ఇక్కడ ఫన్‌ జోన్‌ ఏర్పాటుచేశామని ఆయన అన్నారు. స్కూల్‌ పిల్లలకు ప్రత్యేకంగా ప్యాకేజి ఉంటుందని, అలాగే వివిధరకాల ప్యాకేజీలు వుంటాయని, పదిమందిని తీసుకు వచ్చి, సరదాగా  పిల్లలకు  బర్త్‌ డే పార్టీలు కూడా నిర్వహించుకోవచ్చని ఆయన వివరించారు. 12డి థియేటర్‌, 9డి సిములేటర్‌, ఇన్‌ ఫిన్‌ టి రూమ్‌,ప్లే రూమ్‌, స్పిన్నింగ్‌ టన్నెల్‌, స్క్రే హౌస్‌, ప్లే పెన్‌, వర్ట్యువల్‌ రియాల్టీ – రోలర్‌ కోస్టర్‌, గేమ్స్‌, కిడ్డీ రైడ్స్‌ వంటి వాటిని ఏర్పాటుచేశామని, కుటుంబాలతో సహా ఇక్కడకు వచ్చి ఎంజాయ్‌ చేయవచ్చని ఆయన తెలిపారు. రౌతు సూర్య వరుణ్‌, వాకచర్ల క ష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here