ఎంవివీఎస్‌ మూర్తికి జిల్లా తెదేపా నివాళి 

0
252
కాకినాడ,అక్టోబర్‌ 3 : తెదేపా సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ ఎంవివీఎస్‌ మూర్తి మృతికి పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సంతాపం వ్యక్తం చేసింది. ఈరోజు కాకినాడలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలు మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీకి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎం.పి. పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీ చిక్కాల  రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వరుపుల సుబ్బారావు, దాట్ల బుచ్చిరాజు, వంతల రాజేశ్వరి, పెందుర్తి వెంకటేష్‌, శాప్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, పార్టీ కాకినాడ రూరల్‌ నియోజకవర్గ నాయకులు పిల్లి సత్తిబాబు, తుని నియోజకవర్గ నాయకులు యనమల కృష్ణుడు, బిసి కార్పొరేషన్‌ డైరక్టర్‌ పెచ్చేటి చంద్రమౌళి, పార్టీ కార్యాలయం కార్యదర్శి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here